Varalaxmi Sarath Kumar Counter to Reporter on Charecter Artist Comments: ఈ మధ్యకాలంలో వరుస హిట్ సినిమాలతో దూసుకుపోతోంది వరలక్ష్మి శరత్ కుమార్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన శబరి అనే సినిమా మే మూడో తేదీన తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాని తెలుగులోనే కాదు తమిళ కన్నడ మలయాళం హిందీ భాషల్లో సైతం అదే రోజు రిలీజ్ చేస్తున్నారు. కొత్త దర్శకుడు అనిల్ దర్శకత్వంలో ఈ సినిమాని కొత్త నిర్మాత మహేంద్ర నిర్మించారు. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా వరలక్ష్మి శరత్ కుమార్ తాజాగా మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమెను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని సంబోధించిన రిపోర్టర్ కి ఆమె కౌంటర్ ఇచ్చారు. మీరు ఈ మధ్యకాలంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన వీర సింహారెడ్డి, హనుమాన్, నాంది లాంటి సినిమాలు అంటూ రిపోర్టర్ ప్రస్తావించగా ఆ సినిమాలలో నేను చేసింది క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానా అంటూ ఆమె ప్రశ్నించారు.
Double Ismart : రామ్ కారణంగానే షూటింగ్ ఆగిపోయిందా..?
ఓ వీర సింహ రెడ్డి సినిమాలో నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించానా? అని అడిగితే మీరు చేసింది ఒక స్పెషల్ రోల్ కదా అని రిపోర్టర్ అన్నారు. అంటే అది మీకు స్పెషల్ రోల్ అనిపించిందా అని ఆమె మళ్ళీ ప్రశ్నించారు. అంటే హీరో, హీరోయిన్ కాకుండా మిగతా పాత్రధారులను క్యారెక్టర్ ఆర్టిస్టులు కానీ సంబోధిస్తాం కదా అంటే సరే హీరో హీరోయిన్లతో పోలిస్తే ఎవరి రోల్ ఎక్కువగా ఉంది అని అడిగితే హీరోయిన్ రోల్ కంటే మీదే ఎక్కువ ఉందని సదరు రిపోర్టర్ పేర్కొన్నారు. నాదే ఎక్కువ అంటే నేనే లీడ్, నా ప్రకారంలో ఆ సినిమాలో బాలకృష్ణ గారి తర్వాత నేనే లీడ్ అని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సినిమాలో నేను బాలకృష్ణ గారితో డాన్స్ చేయలేదు కాబట్టి మీరు నన్ను క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని అనుకోవద్దు. నా ప్రకారం నేను ఆ సినిమాలో మెయిన్ లీడ్ గానే పనిచేశాను అంటూ వరలక్ష్మి పేర్కొన్నారు.