నటసింహం నందమూరి బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేని కలిసి మాస్ ట్రీట్ అందించబోతున్న విషయం తెలిసిందే. పక్కా మాస్ అండ్ కమర్షియల్ చిత్రంగా వీరిద్దరి కాంబోలో ‘ఎన్బీకే 107’ మూవీ రూపొందుతోంది. ఈ చిత్రంలో నటించబోయే తారల గురించి మేకర్స్ అప్డేట్స్ రూపంలో విడుదల చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్, దునియా విజయ్ నటించబోతున్నారని తెలిపిన టీం తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న చిత్రంలో ఓ పవర్ ఫుల్ రోల్ లో కన్పించబోతున్నట్టుగా అఫిషియల్ గా అనౌన్స్ చేశారు.
Read Also : జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ఆర్జీవీ సెటైర్లు
గత ఏడాది గోపీచంద్ మలినేని దర్శకత్వంతో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ ‘క్రాక్’లో వరలక్ష్మి ‘జయమ్మ’ అనే పవర్ ఫుల్ నెగెటివ్ రోల్ లో కన్పించింది. ఇప్పుడు మరోసారి గోపీచంద్ నెక్స్ట్ మూవీ లో కూడా బలమైన పాత్రను పోషించడానికి బోర్డులోకి వచ్చింది. ఈ చిత్రంలో బాలకృష్ణ సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. శాండల్‌వుడ్ స్టార్ దునియా విజయ్ తన మొదటి టాలీవుడ్ సినిమాతోనే ఒక శక్తివంతమైన ప్రతినాయకుడిగా కనిపించబోతున్నారు. యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను నవీన్ యెర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మించనున్నారు. థమన్ సౌండ్ ట్రాక్స్ అందించగా, రిషి పంజాబీ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించగా, నేషనల్ అవార్డ్ విన్నింగ్ క్రాఫ్ట్స్‌మెన్ నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెలలో ప్రారంభం కానుంది.