జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ఆర్జీవీ సెటైర్లు

సినిమా టిక్కెట్ల విషయమై వివాదం రానురానూ మరింత ముదురుతున్న విషయం తెలిసిందే. వివాదాస్పద దర్శకుడు ఆర్జీవీ ఈ కాంట్రవర్సీలోకి ఎంటర్ అవ్వడం మరింత ఆసక్తికరంగా మారింది. తాజాగా వైసీపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపిస్తూ రామ్ గోపాల్ వర్మ పోస్ట్ చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. సినిమా మేకింగ్, బిజినెస్, హీరోల రెమ్యూనరేషన్ తదితర అంశాలకు సంబంధించి ఆయన సంధించిన పది లాజికల్ ప్రశ్నలు సంధించడం సంచలనం రేపింది. అయితే ఆయన ప్రశ్నలకు కౌంటర్ వేస్తూ పేర్ని నాని సైతం సరుస ట్వీట్లతో సమాధానం ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా వర్మ సినిమా టికెట్ రేట్ల విషయమై స్పందించిన జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై ట్విట్టర్ వేదికగా సెటైర్లు వేశారు.

Read Also : బ్రేకింగ్ : “రాధేశ్యామ్” పోస్ట్ పోన్… డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ

జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి సినిమా టిక్కెట్ల వివాదం గురించి ఓ మీడియా ఛానల్ తో మాట్లాడుతూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామికంగా ఎన్నికైన ప్రభుత్వం ప్రజల కోసం ఏదైనా చట్టం చేయొచ్చు. వాళ్ళు కామన్ మ్యాన్ ను దృష్టిలో పెట్టుకునే చేస్తారు. ప్రైవేట్ ఓనర్ నష్టపోతాడు అనుకుంటే ను నష్టాలు తగ్గించుకో. ఎవరు పెట్టామన్నారు మిమ్మల్ని కోట్లకు కోట్లు? ఒక హీరోకు 30 కోట్లకు పైగా ఎవరు ఇవ్వమన్నారు ? వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు… మీరు ఇస్తున్నారు. సీనియర్ హీరోలను తీసుకున్నాము. వాళ్లకు 50 కోట్లు ఇవ్వాలి అంటే… దేశంలో హీరోలే లేరా ? కామన్ మ్యాన్ కు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి అనేదే ఎంటర్టైన్మెంట్ ప్రధాన ఉద్దేశం. ప్రజల్లో చైతన్యం కలిగించే సినిమాలు ఒక్కటైనా ఉన్నాయా ? షావుకార్లు ఇంట్లోనే థియేటర్లు పెట్టుకుని చూస్తున్నారు. వాళ్లకేం నష్టం లేదు. లేబర్, సామాన్యులకే నష్టం అంతా… వాళ్ళు సినిమా చూడకుండా ఉండలేరు. వాళ్ళ దగ్గర వెయ్యి రూపాయలకు పైగా వసూలు చేస్తున్నారు. ఇంతకుముందు అలా లేదు. థియేటర్లలో ఉండే సౌకర్యాలను బట్టి రేట్లను నిర్ణయించేవారు. అన్ని థియేటర్లలో ఇదే డిఫరెన్స్ ఉండేది. ఎంటర్టైన్మెంట్ కోసం ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాను, వాళ్ళ వీక్ నెస్ ను అడ్వాంటేజ్ గా తీసుకుని ప్రజల దగ్గర ఎంతైనా వసూలు చేస్తాను ? మా ఇష్టం వచ్చినట్టు చేసుకుంటాము… మాకు ఖర్చు అయ్యింది అంటే… ఇంకా థియేటర్ల యజమానులే ప్రభుత్వాలు నడిపితే సరిపోతుంది.. వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు చేసుకోవచ్చు… ప్రజలకు ఏది మంచిది అని ఆలోచించే బాధ్యత ప్రభుత్వానికి ఉంది” అంటూ చెప్పుకొచ్చారు జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి.

Rea Also : మీ నెత్తిన ఎక్కి తొక్కామా ?… ఆర్జీవికి పేర్ని నాని కౌంటర్

అయితే ఆయన మాట్లాడిన వీడియోను ట్విట్టర్లో పంచుకున్న వర్మ… జస్టిస్ లక్ష్మణ్ రెడ్డిపై సెటైర్లు పేల్చారు. “స్టీవెన్ స్పీల్‌బర్గ్, జేమ్స్ కామెరూన్, క్రిస్టోఫర్ నోలన్ వంటివారు సినిమాపై ఈ మేధావికి ఉన్న అద్భుతమైన అవగాహనకు స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాలి. ఇక ఈ వ్యక్తి అభిప్రాయాన్ని మాకు తెలిపినందుకు ప్రముఖ టీవీ ఛానల్ కు 1000 ముద్దులు…. సినిమా అంటే ఎలా ఉండాలనే దానిపై జస్టిస్ లక్ష్మణ్ రెడ్డికి ఉన్న అసామాన్యమైన అవగాహన సినీ పరిశ్రమతో సహా ప్రతి ఒక్కరిలో ఉంది. రాజమౌళి, సుకుమార్ తో పాటు మనమందరం ఈ బహుమతి కోసం ఆ టీవీ పాదాలను తాకాలని కోరుకుంటున్నాము… గూస్‌బంప్స్” అంటూ సెటైరికల్ ట్వీట్ చేశారు.

Related Articles

Latest Articles