V. V. Vinayak: తొలి తెలుగు పాన్ ఇండియా బాలల చిత్రం ‘లిల్లీ’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
V. V. Vinayak: గోపురం స్టూడియోస్ పతాకంపై కె. బాబురెడ్డి, జి. సతీష్‌కుమార్ నిర్మించిన బాలల చిత్రం ‘లిల్లీ’. ఈ మూవీతో శివమ్ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. నేహ లీడ్రోల్లో వేదాంత్ వర్మ, ప్రణితారెడ్డి బాలనటులుగా నటించిన ఈ చిత్రంలో రాజ్వీర్ ముఖ్య పాత్రను పోషించారు. శనివారం హైదరాబాద్‌లో ‘లిల్లీ’ సినిమా ప్రమోషన్‌ను లాంఛనంగా ప్రారంభించింది చిత్రయూనిట్. ముఖ్య అతిథిగా హాజరైన దర్శకుడు వి. వి. వినాయక్ ‘లిల్లీ’ సినిమా ఫస్ట్‌లుక్ పోస్టర్‌తో పాటు సినిమాలోని ఎమోషనల్ సాంగ్‌ను విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ”దర్శకుడు శివమ్ తెరకెక్కించిన ఈ మూవీ క్యాన్సర్ పై పోరాటం మీద వుంటుంది. క్యాన్సర్ ని ఓ డైనోసార్ తో పోలుస్తూ… పోస్టర్ డిజైన్ చేసిన విధానం నచ్చింది. సీనియర్ నటుడు శివకృష్ణగారు సినిమాల మీద ఎంతో ప్యాషన్ ఉన్న వ్యక్తి. నా ‘చెన్నకేశవ రెడ్డి’లో ఆయన నటించారు. ఇటీవల ఈ సినిమా రీ-రిలీజ్ అయినప్పుడు నాకు ఫోన్ చేసి సినిమా రికార్డుల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మనవడు నటించిన ఈ సినిమా హిట్ అవ్వాలి” అని అన్నారు. దర్శకుడు శివమ్ మాట్లాడుతూ, ”మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ‘అంజలి’ సినిమానే దీనికి ఇన్స్పిరేషన్. మణి సార్‌కి ఏకలవ్య శిష్యుణ్ని నేను. ఈ రోజుల్లో ఒక బాలల చిత్రాన్ని దేశవ్యాప్తంగా నిర్మాతలు విడుదల చేయాలని అనుకోవడం గ్రేట్” అని అన్నారు.
Also Read
- Suriya: 200 రోజులు కష్టపడ్డా ఫ్లాప్.. 45 రోజుల్లో తీస్తే ఇండస్ట్రీ హిట్! ఆ రెండు సినిమాలపై సూర్య షాకింగ్ కామెంట్స్..
- Buchi Babu: డైరెక్టర్ నుంచి నిర్మాతగా 'పెద్ది' దర్శకుడు.. కొత్త హీరోను పరిచయం చేసే ప్లాన్?
- Box Office Clash: హారర్ vs రొమాన్స్ vs మాస్ vs యాక్షన్.. ఈ శుక్రవారం బాక్సాఫీస్ దద్దరిల్లాల్సిందే..!
- SVC 63: టైటిల్ లేదు.. హైప్ మాత్రం పీక్స్‌లో.. మొదలైన సల్మాన్, నయనతారల హై వోల్టేజ్ యాక్షన్
Read Also: Chiranjeevi: రాజమౌళి డైరెక్షన్లో సినిమా.. బాంబ్ పేల్చిన మెగాస్టార్
నిర్మాత బాబురెడ్డి మాట్లాడుతూ, ”సినిమాలో ఎటువంటి వల్గారిటీ లేకుండా వుంటేనే నేను నిర్మిస్తానని దర్శకుడికి చెప్పాను. అలాంటి కథనే చెప్పి నన్ను ఒప్పించాడు. పిల్లల్ని దేవుళ్లంటారు కదా! ఈ సినిమా చూస్తే అలా ఎందుకంటారో అర్ధమవుతుంది. ప్రస్తుత సమాజంలో పిల్లల్ని సినిమాలకు తీసుకెళ్లాలంటే పేరెంట్స్ భయపడుతున్నారు. కానీ, మా సినిమాకి పెద్దవాళ్లే సినిమా చూడమని పిల్లల్ని పంపుతారు” అని అన్నారు. నటుడు శివకృష్ణ మాట్లాడుతూ, ”ఇలాంటి మంచి సినిమాలు ఎప్పుడో ఓ సారి మాత్రమే తలుపు తట్టి మన దగ్గరికి వస్తాయి. ఈ చిత్రంలో నటించిన నేహ, దివ్యతో పాటు నా మనవడు వేదాంత్‌వర్మ కూడా ఎంతో చక్కగా నటించాడు. ఈ ముగ్గురూ ‘లిల్లీ’ వంటి మంచి చిత్రంతో నటులుగా పరిచయం అయినందుకు ఆనందంగా ఉంది” అని అన్నారు. ఈ కార్యక్రమంలో కీలకమైన రియల్‌లైఫ్ పాత్రలో నటించిన మలయాళ హీరో రాజీవ్‌పిళ్లై, బాలీవుడ్ నటి మిషెల్ షా కూడా పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
-
Trump-Netanyahu: ట్రంప్‌నకు నెతన్యాహు షాక్.. కీలక ప్రతిపాదన తిరస్కరణ!
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!