Urvashi Rautela: బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశీ రౌతేలా, క్రికెటర్ రిషబ్ పంత్ మధ్య మాటల యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకొంది. ఒకరిపై ఒకరు సోషల్ మీడియాలో దూషించుకుంటున్నారు. నిన్న రిషబ్ వేసిన పోస్ట్ ను నేడు ఊర్వశీ కౌంటర్ ఎటాక్ ఇచ్చింది. అయితే కొద్దిగా ఆ పోస్ట్ రిషబ్ ను అవమానించేలా ఉండడంతో నెటిజన్లు ఊర్వశీని విమర్శిస్తున్నారు. రిషబ్ లాంటి ఒక స్టార్ క్రికెటర్ ను పట్టుకొని పిల్ల బచ్చా అనేసింది. అంతేకాకుండా కౌంగర్ హంటర్ అని కూడా అనేసింది. కౌంగర్ హంటర్ అంటే తనకంటే పెద్ద వయస్సు ఉన్న అమ్మాయితో లైంగిక సంబంధం పెట్టుకొనే వారిని ఆలా పిలుస్తారు. నిన్న రిషబ్ అక్కా నన్ను ఒంటరిగా వదిలేయ్ అన్న డైలాగ్ కు ఊర్వశీ స్పందిస్తూ “చిన్న తమ్ముడు .. నువ్వు బ్యాట్, బాల్ తో ఆడుకో. నేనేమి మున్నీని కాదు. నీలాంటి పిల్ల బచ్చాల వలన బద్నామ్ కావడానికి” అంటూ చెప్పుకొస్తూ అడ్వాంటేజ్ తీసుకోవడానికి ట్రై చేయకు,కౌంగర్ హంటర్, రక్షా బంధన్ శుభాకాంక్షలు ఆర్పీ తమ్ముడు అంటూ హ్యాష్ టాగ్స్ జోడించింది.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ఇదంతా మొదలు కావడానికి కారణం ఊర్వశీ, రిషబ్ గురించి చెప్పడమే. ఒక ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తానూ ఎయిర్ పోర్టు లో ఉన్నప్పుడు ఆర్పీ అనే వ్యక్తి తనను కలవడానికి వచ్చాడని, కానీ షూటింగ్ లో అలసిపోవడం వలన తాను నిద్రపోయానని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా లేచి చూసేసరికి తనకు 17 మిస్డ్ కాల్స్ ఉన్నాయని, ఆ ఆర్పీ ఎవరో కాదు రిషబ్ అని కూడా చెప్పుకొచ్చింది. ఇక ఈ వ్యాఖ్యలకు రిషబ్ స్పందిస్తూ ఫేమ్ కోసంకొంతమంది ఎలాంటి నీచమైన వ్యాఖ్యలు చెప్పడానికైనా దిగజారతారు. అక్క నన్ను వదిలేయ్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈ మాటల యుద్ధం నేడు తీవ్ర స్థాయికి చేరింది. మరి ఈ పోస్ట్ పై రిషబ్ ఎలా స్పందిస్తాడో చూడాలి.