దబిడిదబిడి అంటూ బాలయ్యతో చిందులేసిన బాలీవుడ్ సోయగం ఊర్వశి రౌతేలా సోషల్ మీడియాలో గ్లామర్ ట్రీట్ చేస్తూ కాక రేపుతోంది. వాల్తేర్ వీరయ్య. స్కంద సినిమాలలో ఐటం సాంగ్స్ టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్న బ్యూటీ. మసాలా మ్యాగజైన్ కోసం ఇచ్చిన ఫోటోలతో హల్ చల్ చేసింది. ఇక ఇటీవల టాలీవుడ్ డైరెక్టర్ గోపిచంద్ మలినేని డైరెక్ట్ చేసిన జాట్ సినిమాలో మరొకసారి తన డాన్స్ తో హీట్ పుట్టించింది ఊర్వశి రౌతేలా.
Also Read : Pawan Kalyan : పవర్ ఆఫ్ మ్యానరిజమ్స్.. ‘బద్రి’ రీరిలీజ్ ప్లానింగ్
వెండితెరపై హీట్ పుట్టించే ఊర్వశి.. ఆఫ్ స్క్రీన్ లో తన నోటి దురదతో వివాదాలు కోరి తెచ్చుకుంటుంది. మొన్నామధ్య తాను నటించిన సినిమా వందకోట్లు రాబట్టింది, కియార నటించిన సినిమా ప్లాప్ అయిందని కామెంట్స్ చేసింది. రోజు రోజుకి ఈ బ్యూటీకి పైత్యం పెరిగిపోతుందనే చెప్పాలి. తాజాగా మరోసారి అతిగా అనిపించే కామెంట్స్ చేసింది ఊర్వశి. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ’ నార్త్ ఇండియాలో నా పేరు మీద ఓక గుడి ఉంది. బద్రీనాథ్ టెంపుల్ పక్కన ఉన్నఊర్వశి టెంపుల్ నా కోసం కట్టారు. అలాగే టాలీవుడ్ లో చిరు సీనియాతో ఎంట్రీ ఇచ్చి బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల సినిమాలతో నాకు ఫ్యాన్స్ వచ్చారు. నార్త్ లో లాగే నాకు సౌత్ లో కూడా నా ఫ్యాన్స్ గుడికట్టాలని కోరుతున్నాను’ అని చెప్తోంది. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పైత్యం ఎక్కవైతే ఇంతే ఇలానే మాట్లాడుతారని బాలీవుడ్ బ్యూటీపై నెటిజన్స్ ట్రోలింగ్ చేస్తున్నారు.