పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ తొలినాళ్లలో వచ్చిన సినిమా బద్రి. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్న టైమ్ లో పూరి జగన్నాథ్ ని దర్శకునిగా పరిచయం చేస్తూ చేసిన సినిమా బద్రి. 2000లో విడుదలైన ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ముఖ్యంగా పవర్ స్టార్ చెప్పిన ‘నువ్వు నంద అయితే నేను బద్రి బద్రీనాధ్ అయితే ఏంటి అన్నటువంటి డైలాగ్స్ యూత్ లో మంచి క్రేజ్ ను తీసుకువచాయి. పవర్ స్టార్ బెస్ట్ సినిమాలో బద్రికి స్పెషల్ ప్లేస్ ఉంటుంది.
Also Read : Ayesha Khan : అయ్యయ్యో అయేషా ఖాన్.. ఆ నడుము ఎక్కడ చేపించావ్..
కాగా ఇప్పుడు మరోసారి బద్రి తన మాస్ మ్యానరిజం చూపించేందుకు రెడీ అవుతున్నాడు. టాలీవుడ్ లో ఇటీవల రీరిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపధ్యంలో బద్రి కూడా రిరిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రీరిలీజ్ కావాల్సి ఉంది కానీ అనుకోని కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. కానీ ఈ ఏడాది పవన్ బర్త్ డే కానుకగా అనగా సెప్టెంబర్ 2కి రిరిలీజ్ చేసే ప్లానింగ్స్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ప్రింట్ పనులు జరుగుతున్నాయని సమాచారం. మంచి క్వాలిటీతో, పర్ఫెక్ట్ ఆడీయో క్వాలిటీతో ఈ సినిమాను రిలీజ్ తీసుకురానున్నారని టాక్. ఏదేమైనా బద్రి ఎప్పుడు వచ్చిన సరే రీరిలీజ్ లో రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ రాబడుతున్న సినిమాల లిస్ట్ ఈ సినిమా చేరడం గ్యారెంటీ.