ఎస్ఎస్ఎంబీ29 షూటింగ్ లో పాల్గొఉంటునే ఏప్రిల్ నెలలో ఫ్యామిలీతో ఫారెన్ ట్రిప్ ఎంజాయ్ చేశాడు. ఇటలీలో వెకేషన్ ఎంజాయ్ చేసిన మహేశ్ రిటర్నై సెట్స్‌లో అడుగుపెట్టాడు. ఇలా వచ్చాడో లేదో మళ్లీ షూటింగ్‌కు బ్రేక్ ఇవ్వబోతున్నాడట. ప్రస్తుతం జరుగుతున్నషెడ్యూల్ కంప్లీట్ కాగానే లాంగ్ లీవ్ తీసుకుంటాడట సూపర్ స్టార్. ఈ ఏడాది ఎండలు మండిపోవడంతో టీమే సమ్మర్ హాలీడేస్ ఇవ్వాలనుకుందట. దీంతో ఫ్యామిలీతో మరో వెకేషన్ ప్లాన్ చేస్తున్నాడట మహేశ్. సుమారు సమ్మర్ అంతా హాలీడేస్ తీసుకుని జూన్ నుండి సెట్స్‌లోకి అడుగుపెట్టే అవకాశాలున్నాయన్నది ఫిల్మ్ నగర్ లో వినిపిస్తున్న లేటెస్ట్ టాక్.
మహేష్ బాబు కన్నా ముందే బ్రేక్ తీసుకున్నాడు రామ్ చరణ్. బుచ్చిబాబు దర్శకత్వంలో వస్తోన్న స్పోర్ట్స్ డ్రామా పెద్ది లేటెస్ట్ షెడ్యూల్ కంప్లీట్ కావడంతో ల్యాంగ్ గ్యాప్ డిసైడ్ చేశాడు. పర్సనల్ కమ్ ప్రొఫెషనల్ వర్క్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నాడు. మే 9న లండన్‌లోని మేడమ్ టుస్సాడ్‌లో తన మైనపు విగ్రహావిష్కరణకు హాజరు కానున్న చెర్రీ. ఈ ఈవెంట్ కంప్లీటయ్యాక మే 11న రాయల్ ఫిల్హార్మోనిక్ ఆర్కెస్ట్రా లైవ్ కాన్సర్ట్ కు హాజరు కానున్నాడు. ఈ లైవ్ కాన్సర్టులో త్రిబుల్ ఆర్ బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రదర్శించనున్నారు. లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్లో ఈవెంట్ జరగనుంది. ఈ నేపథ్యంలో నెక్ట్స్ షెడ్యూల్‌కు 20 డేస్ లాంగ్ గ్యాప్ ఇవ్వబోతున్నాడట. ఈ లెక్కన ఇద్దరు స్టార్ హీరోలు సమ్మర్ మొత్తం షూటింగ్స్‌కు గుడ్ బాయ్ చెప్పనున్నారు.