పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మలయాళ డ్రామా “అయ్యప్పనుమ్ కోషియుమ్” రీమేక్ లో నటిస్తున్నారు. కొన్ని వారాల నుంచి ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దగ్గుబాటి రానా కూడా భాగం అన్న విషయం తెలిసిందే. ఇక కొన్ని రోజుల క్రితం నిత్యామీనన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోందని, ఆమె పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది అని ప్రకటించారు.
Read Also : శ్రీదేవితో ఆమీర్ సినిమా చేయనన్నాడు! ఎందుకంటే…
ఈ యాక్షన్ డ్రామాలో రానా దగ్గుబాటి సరసన ఐశ్వర్య రాజేష్ నటిస్తోంది. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ తన పుట్టినరోజు జరుపుకోనున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి సినిమాలో నుంచి మొదటి పాటను సెప్టెంబర్ 2 న విడుదల చేయబోతున్నారు. అంతేకాకుండా “పిఎస్పికే28” నుంచి కూడా సర్ప్రైజ్ ఉండబోతోందని సమాచారం. హరీష్ శంకర్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమా నుంచి కొత్త పోస్టర్ ను పవన్ బర్త్ డే ట్రీట్ గా రిలీజ్ చేయనున్నారట. హరీష్ శంకర్ ఈ పోస్టర్‌ను ఇప్పటికే లాక్ చేసారని అంటున్నారు. మెగా పవర్ ఫ్యాన్స్ డబుల్ ట్రీట్ కోసం సిద్ధంగా ఉండండి.
తాజా సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్ షూటింగ్ చేస్తున్నారు. ఈ ప్రత్యేక సీక్వెన్స్ సినిమాలో హైలెట్ గా నిలిచే ముఖ్యాంశాలలో ఒకటిగా నిలవనుంది. నాగ వంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.