సోషల్ మీడియా వచ్చాకా సైబర్ నేరగాళ్ల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. స్టార్ల అకౌంట్లను హ్యాక్ చేయడం, వారి పేరు మీద ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేయడం అలవాటుగా మారిపోయింది. ఇప్పటికే చాలామంది నటీనటులు ఇలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఇక తాజగా కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ భార్య షాలిని కూడా ఇదే ఇబ్బందిని ఎదుర్కొంటుంది. నటిగా, అజిత్ భార్యగా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న షాలిని పేరుమీద ట్విట్టర్ లో ఒక కొత్త అకౌంట్ ఓపెన్ అయ్యింది. మిస్సెస్ షాలిని అజిత్‌కుమార్ పేరుతో క్రియేట్ అయిన ఈ ట్విట్టర్ అకౌంట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.
మొదటిసారి షాలిని ట్విట్టర్ ఓపెన్ చేయడంతో అజిత్ ఫ్యాన్స్, నెటిజన్స్ ఆమెను ఫాలో అవ్వడం ప్రారంభించారు. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే .. అది షాలిని రియల్ అకౌంట్ కాదు.. ఎవరో గుర్తుతెలియని దుండగులు క్రియేట్ చేసిన ఫేక్ అకౌంట్.. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఈ విషయం తెలుసుకున్న అజిత్ మేనేజర్ రంగంలోకిదిగి క్లారిటీ ఇచ్చారు. షాలినికి ఎలాంటి ట్విట్టర్ అకౌంట్ లేదని, ఇది ఫేక్ అకౌంట్ అని తేల్చేశారు. అంతేకాకుండా ఈ పనిచేసినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కూడా తెలిపారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.