Salman khan : బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ మీద తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. మనోడు ఏం చేసినా తిట్లు తిట్టించుకోడానికే అన్నట్టే ఉంటుందని కామెంట్లతో హోరెత్తిస్తున్నారు. పహల్గాం ఘటన జరిగినప్పటి నుంచి మొన్న ఆపరేషన్ సిందూర్ దాకా సల్మాన్ ఖాన్ ఒక్క పోస్టు కూడా పెట్టకుండా సైలెంట్ గా ఉండిపోయాడు. కానీ నిన్న భారత్-పాక్ సీజ్ ఫైర్ ప్రకటించగానే.. వెంటనే సల్మాన్ పోస్టు పెట్టాడు. ‘కాల్పుల విరమణ దేవుడికి ధన్యవాదాలు’ అంటూ పోస్టు పెట్టగా క్షణాల్లోనే వైరల్ అయింది. ఇది చూసిన వారంతా సల్మాన్ ను ఏకిపారేస్తున్నారు. పహల్గాం ఘటన జరిగినప్పుడు ఎందుకు పోస్టు పెట్టలేదు అంటూ ప్రశ్నిస్తున్నారు.
Read Also : Kingdom : కింగ్ డమ్ వాయిదా..?
ఆపరేషన్ సిందూర్ పై దేశమంతా ప్రశంసిస్తే అప్పుడెందుకు స్పందించలేదు అని మండిపడుతున్నారు. ఇప్పుడు సీజ్ ఫైర్ అనగానే పోస్టు పెడుతావా అంటూ సల్మాన్ ఖాన్ ను దుమ్మెత్తిపోస్తున్నారు. నువ్వు దేశంపై ఎప్పుడూ ప్రేమ చూపించవా.. పాకిస్థాన్ కు సపోర్ట్ చేస్తున్నావా అంటూ తిట్టిపోస్తున్నారు. ఇలా విపరీతమైన ట్రోల్స్ రావడంతో సల్మాన్ తన పోస్టును డిలీట్ చేశాడు. అయితే దీన్ని సల్మాన్ ఫ్యాన్స్ మరోలా సపోర్ట్ చేస్తున్నారు. కాల్పుల విరమణను పాకిస్థాన్ ఉల్లంఘించినందుకే సల్మాన్ ఆ పోస్టు డిలీట్ చేశాడంటూ చెబుతున్నారు. ఏదేమైనా సల్మాన్ ఖాన్ చేసిన పని మాత్రం చివరకు ట్రోల్స్, విమర్శలకు తావిచ్చేసింది.
Read Also : RRR : RRR టీమ్‌తో సందడి చేయనున్న మహేష్ బాబు