Trivikram: పూజాకు రెండు కోట్ల కారు గిఫ్ట్ ఇచ్చిన త్రివిక్రమ్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం త్రివిక్రమ్.. మహేష్ బాబుతో హ్యాట్రిక్ హిట్ కొట్టడానికి రెడీ అయ్యాడు. అతడు, ఖలేజా తరువాత వీరిద్దరి కాంబోలో వస్తున్న చిత్రం SSMB28. ఇక ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే నటిస్తుంది. మొదటి నుంచి త్రివిక్రమ్ రీపీట్ చేసిన హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది పూజానే. అరవింద సమేత, అల వైకుంఠపురంలో, ఇప్పుడు మహేష్ సినిమాలో కూడా ఆమె నటిస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. త్రివిక్రమ్ నెక్స్ట్ చేస్తున్న అల్లు అర్జున్ ఫిల్మ్ లో కూడా పూజానే హీరోయిన్ అని టాక్. దీంతో వీరిద్దరి మధ్య ఏదో రిలేషన్ నడుస్తుందని పుకార్లు పుట్టుకొచ్చాయి. అందులో నిజం ఎంత అనేది తెలియదు.. వారిద్దరూ కూడా ఈ వార్తలపై స్పందించిందీ లేదు. ఇకపోతే తాజాగా త్రివిక్రమ్.. పూజా హెగ్డేకు రెండు కోట్ల విలువైన కారును గిఫ్ట్ గా ఇచ్చినట్లు సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఆ కారులోనే పూజా షూటింగ్స్ కు రానున్నదట.
Simbu: ప్రియరాళ్లకు పెళ్లిలు చేసి.. పెళ్లి పీటలు ఎక్కుతున్న స్టార్ హీరో..?
Also Read
- Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
- Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
- Dasara movies : దసరా రేసులో 4 సినిమాలు.. ఏ సినిమాకు క్రేజ్ ఎక్కువ?
- Prahaar : సాలిడ్ సక్సెస్ కోసం యంగ్ హీరోపై చాలా నమ్మకం పెట్టుకున్న నిర్మాణ సంస్థ
అయితే అసలు నిజం ఏంటి అంటే.. త్రివిక్రమ్ తన ప్రొడక్షన్ తరుపున ఒక ఇన్నోవా కారును కొనుగోలు చేశాడట. ప్రతిసారి హీరోయిన్లు సెట్ కు రావాలంటే అద్దెకార్లకు డబ్బులు పెట్టాలి. అలా కాకుండా ప్రొడక్షన్ కు ఒక కారు ఉంటే ఆ ఖర్చులు కలిసివస్తాయి అన్న ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ కారు కొన్నాడట. ఇది కేవలం హీరోయిన్స్ కు మాత్రమే అని సమాచారం. అయితే ఇక్కడ విచిత్రమేంటంటే.. ఈ కారు కొన్న మొదటిసారి అందులో ఎక్కే మొదటి హీరోయిన్ పూజానే కావడంతో అభిమానులు వీరిద్దరిపై మరోసారి ట్రోల్స్ చేయడం మొదలుపెట్టారు. ఈ సినిమా అవ్వగానే ఆ ప్రొడక్షన్ లో నటించే ఏ హీరోయిన్ అయినా ఆమెకు కూడా ఈ కారు కొన్నిరోజులు సొంతం అయ్యినట్లే లెక్క.. మరి ఈ కారులో పూజా పాప ఏ రేంజ్ లో సెట్ కు వెళ్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Fauzi : ప్రభాస్‌ను నమ్ముకుంటే.. కెరీర్ వేస్ట్ అవుతుందా ?
-
Akhilesh Yadav: ‘‘ఇది సీట్ల గురించి కాదు, గెలుపు గురించి’’.. కాంగ్రెస్‌కు అఖిలేష్ క్లియర్ మెసేజ్
-
Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Bhagyashri Borse : మాలీవుడ్లోకి భాగ్యశ్రీ బోర్సే స్టెప్ ఇన్.. మోహన్ లాల్ ఆపరేషన్ గంగాలో భాగ్యశ్రీ
-
CEC Gyanesh Kumar: జ్ఞానేష్ కుమార్‌పై విజిలెన్స్ విచారణ.. 20 ఏళ్ల నాటి కేసు మళ్లీ తెరపైకి!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!