Trivikram Srinivas : దివంగత సిరివెన్నెల సీతారామ శాస్త్రి అంటే ఇండస్ట్రీలో విమర్శలకు తావులేని వ్యక్తి. సినిమాలకు పాటలు రాయడంలో ఆయనకున్నంత పట్టు ఇంకెవరికీ ఉండదేమో. అందుకే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కు సిరివెన్నెలతో ఎనలేని అనుబంధం ఉంది. సిరివెన్నెలపై ఎప్పటికప్పుడు తనకున్న అభిమానాన్ని చాటుకునే త్రివిక్రమ్.. ఓ సారి సిరివెన్నలపై కోప్పడ్డాడంట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా తెలిపాడు. అప్పట్లో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ వేడుకపై మాట్లాడుతూ.. సిరివెన్నెల సీతారామ శాస్త్రి గురించి చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. ‘ఆయన రాసిన ఉచ్వాసం కవనం పాట విని నా రెండు చేతులు నా రెండు జేబుల్లో పెట్టుకుని నడుచుకుంటూ వెళ్తున్నాను. నేనెక్కడికి వెళ్తున్నానో కూడా నాకు తెలియదు’ అంటూ చేసిన కామెంట్లు విపరీతంగా వైరల్ అయ్యాయి.
Read Also : Nagarjuna : ఖైరతాబాద్ ఆర్టీవో ఆఫీసులో హీరో నాగార్జున సందడి..
ఆ కామెంట్లపై తాజాగా స్పందించాడు త్రివిక్రమ్. ‘అసలు నేను సిరివెన్నెలను పొగడానిని అంతా అనుకున్నారు. కానీ నేను కోప్పడ్డాను. ఆ విషయం ఎవరికీ అర్థం కాలేదు. పొగడ్తలో చాలా డ్రామా ఉంటుంది. కానీ నేను ఉన్నది ఉన్నట్టు మాట్లాడి ఆయనపై నాకున్న అభిమానాన్ని ఆవేశంగా చెప్పేశాను. అందుకే అతి ఎక్కువ మందికి నచ్చింది. ఆయన మీదున్న అభిమానాన్ని చూపించడానికి నాకు ఆవేశం వచ్చేసింది. ఆయన లాంటి వ్యక్తి తెలుగు ఇండస్ట్రీకి దొరకడు. ఆయన రాసే పాటలు బహుషా ఇంకెవరూ రాయలేరేమో అనిపిస్తుంది. ఆయన ప్రభావం నా మీద చాలా ఎక్కువగా ఉంది’ అంటూ తెలిపాడు త్రివిక్రమ్.
Read Also : JR NTR : ఒక్కసారిగా ఎగబడ్డ ఫ్యాన్స్.. ఎన్టీఆర్ అసహనం..