Allu Arjun – Trivikram: బన్నీ కోసం త్రివిక్రమ్ ‘బీ’ ప్లాన్..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Allu Arjun – Trivikram: ప్రతీ దర్శకుడికీ తనదైన ఒక పంథా ఉన్నట్టు.. త్రివిక్రమ్ కూడా ఒక శైలిని అనుసరిస్తుంటాడు. తన సినిమాల్లోని ప్రధాన పాత్రల కోసం క్రేజీ నటీనటుల్ని.. అందునా ఇతర భాషా పరిశ్రమలకు చెందిన స్టార్ నటుల్ని రంగంలోకి దింపుతుంటాడు. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌తో చేయబోయే సినిమా కోసం కూడా త్రివిక్రమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవ్వబోతున్నాడని సమాచారం.
Attack on MLA: మద్యం మత్తులో కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కత్తితో దాడి.. నిందితుడు అరెస్ట్
Also Read
- S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
- S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
- S Janaki: మన తెలుగు గర్వం ఎస్. జానకి.. గుంటూరు నుంచి భారత సంగీత గగనానికి ఎదిగిన గానకోకిల
- Nagarjuna: కొడుకు సక్సెస్ కోసం నాగార్జున తపన.. ‘లెనిన్’ స్క్రిప్ట్‌లో కింగ్ రైటింగ్!
ప్రస్తుతం తమతమ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న అల్లు అర్జున్ (పుష్ప: ద రూల్), త్రివిక్రమ్ శ్రీనివాస్ (గుంటూరు కారం).. అవి ముగిసిన వెంటనే తమ కాంబోలో ఒక మూవీ చేయబోతున్నారు. ఇప్పటికే ఈ సినిమాని అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ కోసం త్రివిక్రమ్ ఆల్రెడీ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశాడని సమాచారం. ఈ నేపథ్యంలోనే ఒక క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. ఇందులో బన్నీకి తండ్రి పాత్ర కోసం ఒక సీనియర్ నటుడ్ని తీసుకుంటున్నారని, ద్వితీయార్థంలో వచ్చే ఫ్లాష్‌బ్యాక్‌లో ఈ పాత్ర ఎంటర్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. చాలా ఎమోషనల్‌గా ఉండే ఈ పాత్ర ఉంటుందని తెలిసింది. అయితే.. ఈ పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఇన్‌సైడ్ న్యూస్ ప్రకారం.. బాలీవుడ్ నుంచే ఒక సీనియర్‌ని తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
Liquor Stores: నేడు మద్యం దుకాణాల లక్కీ డ్రా.. 33 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలు..
హారిక & హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ కలిసి ఈ భారీ బడ్జెట్ సినిమాని నిర్మించనున్నాయి. ఎస్ఎస్ తమన్ సంగీతం సమకూర్చనున్న ఈ సినిమాను వచ్చే ఏడాదిలో సెట్స్‌పైకి తీసుకెళ్లనున్నారు. ఇంతకుముందు బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. ఇప్పుడు వీరి కాంబినేషన్‌లో ఇది నాలుగో సినిమా కావడంతో.. దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి, వీళ్లు అదే మ్యాజిక్‌ని రిపీట్ చేస్తారో లేదో చూడాలి.
తాజావార్తలు
-
Gujarat: విషాదం.. ప్రముఖ పుణ్యక్షేత్రంలో భక్తుల కళ్లెదుటే బాలుడ్ని చంపిన సింహం
-
Harish Rao : షాబాద్ ఆరుగురి హత్యలు ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే
-
S Janaki: సిరిసిల్లలో పెరిగిన జానకమ్మ.. వేములవాడలో మధుర క్షణాలు..
-
Kejriwal: పెట్రోల్ బంక్ దగ్గర కేజ్రీవాల్ హల్చల్.. E20 పెట్రోల్‌పై తీవ్ర విమర్శలు
-
S Janaki: పెళ్లి.. పిల్లలు.. వేల పాటలు.. ఎస్.జానకి జీవితంలో తెలియని విశేషాలు!
ట్రెండింగ్
-
Kitchen Tips : ఇనుప పాత్రల తుప్పుకు చెక్.. ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Best Jobs: బాస్ తిట్లు, డెడ్లైన్ల ప్రెజర్ లేవు.. మంచి ప్యాకేజీలతో పాటు పీస్ ఆఫ్ మైండ్ ఇచ్చే బెస్ట్ జాబ్స్ ఇవే గురూ..
-
అబ్బో.. BSNL ప్లాన్ మాములుగా లేదుగా.! 5TB డేటా, 200Mbps స్పీడ్, ఫ్రీ OTTలు..
-
Kanpur: డ్రైవ్‌లో బాలికలు, మహిళల ప్రైవేట్ వీడియోలు.. గూగుల్ అలర్ట్‌తో పోలీసులకు చిక్కిన యువకుడు.!
-
New Car Features: మైలేజ్ రోజులు పోయాయి.. ఇప్పుడు కార్లలో ఈ ఫీచర్లకే భారీ క్రేజ్.!