Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Trivikram Srinivas: స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన చిత్రాల్లో ‘అజ్ఞాతవాసి’ ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. ఈ సినిమా తర్వాత తాను ఎదుర్కొన్న ఆర్థిక ఇబ్బందుల గురించి త్రివిక్రమ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన ఆసక్తికర విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో ఈ సినిమా గురించి ఆయన ఆ ఇంటర్వ్యూలో ఏం మాట్లాడారంటే.. ‘అజ్ఞాతవాసి’ వల్ల వచ్చిన నష్టాలను భర్తీ చేసేందుకు ఈ సినిమా నిర్మాత చిన్నబాబుతో కలిసి 48 రోజుల్లోనే ఆర్థిక వ్యవహారాలను పరిష్కరించుకున్నట్లు త్రివిక్రమ్ వెల్లడించారు. నష్టాలను పూడ్చేందుకు తన రెమ్యునరేషన్‌ను తిరిగి ఇచ్చినట్లు కూడా ఆయన వెల్లడించారు.
ఆ సమయంలో జూబ్లీహిల్స్‌లో తాను ఒక కొత్త ఇంటిని నిర్మించుకుంటున్నట్లు త్రివిక్రమ్ చెప్పారు. ఆ కొత్త ఇల్లు పూర్తయిన తర్వాత కుటుంబంతో కలిసి అక్కడికి మారాలని భావించినట్లు చెప్పారు. ఆ టైంలో తన పిల్లలు చదువుకొంటున్నారని చెప్పుకొచ్చారు. అయితే ‘అజ్ఞాతవాసి’ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఏర్పడిన నష్టాల భారం తీవ్రంగా మారడంతో.. నిర్మాణంలో ఉన్న ఆ ఇంటిని అమ్మేసి నష్టాలను పూడ్చుకోవాలని కూడా ఒక దశలో ఆలోచించినట్లు త్రివిక్రమ్ గుర్తుచేసుకున్నారని సమాచారం. ఈ విషయాన్ని తన భార్య, పిల్లలతో కూడా చర్చించినట్లు త్రివిక్రమ్ చెప్పారు. అవసరమైతే నిర్మాణంలో ఉన్న ఇంటిని విక్రయించి, ప్రస్తుతం ఉంటున్న అపార్ట్మెంట్లోనే కొనసాగాల్సి రావచ్చని వారికి చెప్పినట్లు వెల్లడించారు. అయితే దానికి తన భార్య, పిల్లలు మాత్రం ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదని త్రివిక్రమ్ చెప్పారు. ఇల్లు ఉన్నా లేకపోయినా.. కుటుంబంగా కలిసి ఉండటమే ముఖ్యమని, అదే అపార్ట్మెంట్లో కొనసాగేందుకు తాము సిద్ధమేనని వాళ్లు చెప్పినట్లు తెలిపారు. భారీ అంచనాలతో విడుదలైన ‘అజ్ఞాతవాసి’ బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోకపోవడంతో అప్పట్లో ఈ సినిమా గురించి పెద్ద చర్చ జరిగింది. ప్రస్తుతం త్రివిక్రమ్ టాలీవుడ్లో అగ్ర దర్శకుల్లో ఒకరిగా కొనసాగుతున్నారు. అయితే ‘అజ్ఞాతవాసి’ తర్వాత ఎదురైన పరిస్థితులను ఆయన స్వయంగా గుర్తుచేసుకున్న ఈ ఘటన ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Also Read
- Irumudi Remuneration: రెమ్యునరేషన్ జీరో.. లాభాల్లో హీరో! ‘ఇరుముడి’తో రవితేజకు భారీగా కలిసి వచ్చిందంట..
- Yeshanagula Song: థియేటర్లలో సీట్లు సరిపోవు.. లైవ్ కచేరీలే! ‘ఏషనాగుల’పై డైరెక్టర్ ఓదెల మాస్ కామెంట్స్ వైరల్..
- Irumudi OTT : ‘ఇరుముడి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
- Ravi Teja: ఇరుముడి జోష్‌లోనూ రవితేజ కొత్త సినిమాపై సస్పెన్స్! అసలేమైంది?
తాజావార్తలు
-
Trivikram Srinivas: అప్పట్లో ‘అజ్ఞాతవాసి’ దెబ్బకు ఇల్లు అమ్మేయాలనుకున్న త్రివిక్రమ్.. అసలేం జరిగిందంటే?
-
Irumudi: అసలు ఇరుముడి అంటే ఏంటి?
-
Rahul Gandhi: హల్ద్వానీలో ‘శుద్ధీకరణ’ వివాదం.. ఎఫ్ఐఆర్కు రాహుల్ గాంధీ డిమాండ్
-
AI in Cinema: సినీ రంగంపై ఏఐ ఎఫెక్ట్.. సెట్లో 20% మనుషులు, 80% AI.. జూనియర్ ఆర్టిస్టుల పరిస్థితి ఏంటి?
-
Ashwin: “కోహ్లీ కంటే బుమ్రానే బెటర్”.. భారత క్రికెట్ గ్రేటెస్ట్పై అశ్విన్ సంచలన తీర్పు
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!