కోలీవుడ్‌లో ఈ వీక్‌లో స్టార్ హీరోల సినిమాలకు సంబందించి బిగ్ అప్డేట్స్ రానున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సర్ ప్రైజెస్ ప్లాన్ చేస్తున్నాయి ఆయా ప్రాజెక్ట్స్ టీమ్స్. జూన్ 20న రిలీజయ్యే కుబేర సంగతి పక్కన పెడితే టాప్ హీరోల అప్ కమింగ్ ఫిల్మ్స్ నుండి అప్డేట్స్ వచ్చేస్తున్నాయి. ముందుగా జూన్ 20న ఆర్జే బాలాజీ బర్త్ డే సందర్భంగా సూర్య 45 టైటిల్, టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. రీసెంట్లీ ఈ విషయాన్ని రివీల్ చేశాడు మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్. టీజర్ వచ్చే రోజే రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసే అవకాశాలు లేకపోలేదు. ఆరు మూవీ తర్వాత సూర్య- త్రిష నటించబోతున్న మూవీ ఇదే. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
Also Read : Kuberaa Censor : ‘కుబేర’ సెన్సార్. ధనుష్ ఫ్యాన్స్ నజర్.. ఎందుకంటే.?
ఇక జూన్ 21న రజనీకాంత్ అప్ కమింగ్ ఫిల్మ్ జైలర్ 2 నుండి అప్డేట్ రానుందట. ఆ రోజు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ బర్త్ డే. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నుండి చిన్న సర్ ప్రైజ్ రానుందని టాక్. అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నా ఈ సినిమా ఎనౌన్స్ మెంట్ టీజర్‌తోనే గూస్ బంప్స్ తెప్పించాడు. తమిళ తంబీలు మోస్ట్ ఎవైటెడ్‌గా ఎదురు చూస్తున్న డేట్ జూన్ 22. ఆరోజు కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ బర్త్ డే. విజయ్ హై ఆక్డేన్ మూవీ జననాయగన్ నుండి అప్డేట్ రాబోతుంది. దళపతి లాస్ట్ మూవీ కావడంతో జననాయగన్‌పై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. అయితే ఆ రోజు ఫ్యాన్స్‌కు ఫీస్ట్ ఇచ్చేందుకు గట్టిగా ప్లాన్ చేస్తుందట టీం. ఇలా ఒకే వారంలో ముగ్గురు హీరోల క్రేజీ అప్డేట్స్ తో తమిళ్ లో సినిమా సందడి నెలకొంది.