Prabhas: ఆదిపురుష్ ఆల్ షోస్ హౌజ్ ఫుల్… అప్పుడే బోర్డు పెట్టేసారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జూన్ 16న థియేటర్లన్నీ రామ మందిరాలుగా మారుస్తూ ప్రభాస్ నటిస్తున్న ‘ఆదిపురుష్’ సినిమా రిలీజ్ కానుంది. ఈ మోస్ట్ హైప్డ్ మూవీ కోసం ప్రభాస్ ఫాన్స్ మాత్రమే కాదు సినీ అభిమానులందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ట్రైలర్ తో చిన్న సాంపిల్ చూపించిన ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాతో వండర్స్ క్రియేట్ చేస్తాడని ట్రేడ్ వర్గాలు కాన్ఫిడెంట్ గా ఉన్నాయి. 600 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా కలెక్షన్ల లెక్కలు 150 కోట్ల నుంచి మొదలవుతుంది అనే అంచనా వేస్తున్నారు. మొదటి రోజు అన్ని సెంటర్స్ కలిపి 150 కోట్ల గ్రాస్ ని ఆదిపురుష్ రాబడుతుందని ప్రెడిక్ట్ చేస్తున్నారు, ఇదే జరిగితే హయ్యస్ట్ ఓపెనింగ్ డే రికార్డ్స్ ఉన్న హీరోగా ‘ఖాన్ త్రయాన్ని’ కూడా దాటి ప్రభాస్ చరిత్ర సృష్టిస్తాడు. ఓవరాల్ థియేట్రికల్ రన్ లో బాక్సాఫీస్ దగ్గర ఆదిపురుష్ సినిమా వెయ్యి కోట్లు రాబడుతుందని అంతా నమ్ముతున్నారు. ఈ నమ్మకాన్ని నిజం చేస్తూ రోజు రోజుకీ ఆదిపురుష్ సినిమాపై హైప్ పెరుగుతూనే ఉంది.
నెల రోజుల క్రితం ఆదిపురుష్ సినిమాపై అసలు ఎవరికీ ఎలాంటి అంచనాలు లేవు, ఈరోజు ఇండియన్ బాక్సాఫీస్ లెక్కల్ని మార్చే సినిమాగా ఆదిపురుష్ ప్రమోట్ అవుతోంది. లేటెస్ట్ గా ఆదిపురుష్ సినిమాకి హౌజ్ ఫుల్ బోర్డు పడింది. రామాయణం ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని.. న్యూయార్క్ వేదికగా జూన్ 7 నుంచి 18 వరకు జరగనున్న ట్రిబెకా ఫెస్టివల్‌లో.. జూన్ 13న ప్రీమియర్స్‌ను ప్లాన్ చేశారు. ఇప్పటికే బుకింగ్స్ ఓపెన్ అవగా భారీ రెస్పాన్స్ వచ్చింది. దాంతో ప్రీమియర్ షోస్ కూడా పెంచారు. అయితే ఇప్పుడు జూన్ 13 ఉండాల్సిన షోని క్యాన్సిల్ చేసి.. జూన్ 15కి మార్చారు. ఈ ప్రీమియర్ షోస్ కి ఊహించని రెస్పాన్స్ వస్తోంది. మూడు వారాల ముందు టికెట్స్ అయిపోయాయి. ట్రిబెకా ఫెస్టివల్ వాళ్లు ఆదిపురుష్ సినిమాకి హౌజ్ ఫుల్ బోర్డులు పెట్టేసారు. మరి జూన్ 16న ఇండియాలో ఆదిపురుష్ ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.
Also Read
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
- Kandregula Naidu: మాది 3.5 రేటింగ్ సినిమా, తొక్కేయకండి.. 'అనకాపల్లి' నిర్మాత ఆవేదన!
- Indraja: ఫేక్ సక్సెస్ మీట్లకు దూరంగా ఉంటా.. ఇంద్రజ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!
తాజావార్తలు
-
Erravalli Lands : ఎర్రవల్లి భూములపై సీఎం రేవంత్ ఫోకస్.. 45 ఎకరాలు ఏమయ్యాయి?
-
TGSRTC : ఎయిర్పోర్ట్ ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. పుష్పక్ ఛార్జీలు భారీగా తగ్గింపు
-
Team India: న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌కు భారత జట్టు ప్రకటన.. 4 ఏళ్ల తర్వాత జట్టులోకి స్టార్ ప్లేయర్..
-
Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
-
Israel-Gaza: ఇజ్రాయెల్-గాజా యుద్ధానికి రేపటితో మూడేళ్లు.. ఇప్పుడెలా ఉందంటే..!
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!