Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. తక్షణమే క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. తమిళ స్టార్ హీరో సూర్య నటించిన రెట్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా విజయ్ దేవరకొండ వచ్చిన సంగతి తెలిసిందే. ఈవెంట్ లో విజయ్ మాట్లాడుతూ.. పహల్గాం ఘటనపై తీవ్రంగా స్పందించారు. టెర్రరిస్టులకు ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇప్పించి ఇలా బ్రెయిన్ వాష్ కాకుండా చేయడమే సొల్యూషన్ అన్నాడు. వాళ్లు 500 ఏళ్ల క్రితం ట్రైబల్స్ కొట్టుకున్నట్టు కశ్మీర్ లో దాడులు చేస్తున్నారంటూ వాపోయాడు.
Read Also : Sri Vishnu : నా సినిమాల్లో డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేవు.. శ్రీవిష్ణు క్లారిటీ
అయితే విజయ్ స్పీచ్ లో ట్రైబల్స్ కొట్టుకునేవారు అనే పదం వాడటంపై గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. 500 ఏళ్ల క్రితం గిరిజనులు కొట్టుకునేవారు అని విజయ్ అనడం కరెక్ట్ కాదంటున్నాయి. కేవలం గిరిజనులు మాత్రమే కొట్టుకునేవారు.. ఇతర జాతుల వారు కొట్టుకోలేదు అన్నట్టు విజయ్ చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు గిరిజన సంఘాల నేతలు. విజయ్ తక్షణమే గిరిజనులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే విజయ్ ను క్షమించేది లేదని వార్నింగ్ ఇస్తున్నారు.
Read Also : Prayagraj: ఏసీ కోచ్ నుండి దిగి ప్లాట్‌ఫారమ్ పై కుర్చున్న దొంగలు.. చెమటలు పట్టడంతో అసలు విషయం బట్టబయలు!