Nisha Noor: స్టార్ హీరోయిన్.. వ్యభిచారిగా మారి.. చివరికి ఎయిడ్స్ తో ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nisha Noor: సినిమా .. ఒక గ్లామర్ ప్రపంచం. ఇందులో నెగ్గుకురావడం చాలా కష్టం. పైకి రంగులు వేసుకొని మెప్పించడం మాత్రమే అందరికి తెలుసు..కానీ, ఆ రంగు వెనుక ఒక చీకటి ప్రపంచం ఉంటుంది అని చాలా తక్కువమందికి తెలుసు. ఆ చీకటి ప్రపంచంలో కొట్టుకుపోయిన తారలు ఎంతోమంది.. అందులో నిషా నూర్ ఒకరు. నిషా.. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఎన్నో సినిమాల్లో నటించింది. 1980 దశకంలో కమల్ హాసన్, రజినీకాంత్, భాను చందర్, రాజేంద్రప్రసాద్ లాంటి స్టార్ హీరోల సరసన కనిపించి మెప్పించింది. కమల్‌తో టిక్ టిక్ టిక్.. రాజేంద్రప్రసాద్‌తో ఇనిమై ఇదో ఇదో.. రజనీకాంత్‌తో శ్రీ రాఘవేంద్ర.. మమ్ముట్టితో అయ్యర్ ద గ్రేట్.. మోహన్‌లాల్‌తో దేవసురమ్ లాంటి సినిమాల్లో కనిపించిన నిషా.. సడెన్ గా ఇండస్ట్రీకి దూరమయ్యింది. ఒక దుర్మార్గపు నిర్మాత వలలో చిక్కుకొని వ్యభిచార కూపంలో ఇరుక్కుపోయింది. అలా ఎందుకు చిక్కుకుంది అంటే.. అవకాశాలు లేక .. ఎంత స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుందో.. అవకాశాలు లేక.. డబ్బు కోసం విలవిలలాడే పరిస్థితికి చేరుకుంది. ఎక్కడకు వెళ్లినా అవకాశాలు అందకపోయేసరికి.. చేసేది లేక డబ్బు కోసం ఒక నిర్మాత పంచన చేరింది. అతడు ఆమె అందాన్ని చూసి.. డబ్బు వస్తుందని చెప్పి.. ఆమెను బలవంతంగా వ్యభిచార రొంపిలోకి దింపాడు.
Narne Nithin: ఎన్టీఆర్ బావమరిది.. అల్లు అరవింద్ చేతిలో.. నో కన్ఫ్యూజన్
Also Read
మొదట బలవంతంగా వెళ్లినా.. ఆ తరువాత ఆమె అక్కడేఉండిపోవాల్సి వచ్చింది. ఎంత బయటపడాలి అని చూసినా.. ఆ నరకం నుంచి బయటపడలేకపోయింది. ఇక అలా ఉన్నప్పుడే ఆమె ఎయిడ్స్ బారిన పడింది. అందం కరిగిపోయింది.. బలం లేకపోయింది.. ఎంతో అందంగా ఉండే నిషా.. అందవిహీనంగా మారేసరికి ఆ వ్యభిచార కూపం కూడా ఆమెను బయటకు నెట్టేసింది. ఎక్కడకు పోలేని పరిస్థితిలో నడిరోడ్డుపై ముష్టి ఎత్తుకొని బతికింది. చివరకు దర్గాలో ఆమె తలదాచుకునే దుస్థితి. ఇక ఆమెను గుర్తుపట్టిన ఒక ఎన్జీవో.. హాస్పిటల్ కు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించగా .. ఎయిడ్స్ ముదురిపోయిందని తెలిపినట్లు సమాచారం. అలా ఆమె 2007 లో కన్నుమూసింది. ఎలాంటి ఒక హీరోయిన్.. ఎలా బతికిన నటి .. చివరికి అలా అనాధల నడిరోడ్డుపై ఎయిడ్స్ తో మృతి చెందింది. ప్రస్తుతం ఈమె కథ నెట్టింట వైరల్ గా మారింది.
తాజావార్తలు
-
Jharkhand Student Protest: జార్ఖండ్‌లో ఉద్రిక్తంగా మారిన నిరుద్యోగుల పోరు.. అర్ధరాత్రి పోలీసులు ఎందుకు వచ్చారు?
-
CM Chandrababu: సైబర్ క్రైమ్, గంజాయి, బ్లేడ్ బ్యాచ్‌లపై ఉక్కుపాదం.. నేడు సీఎం ఉన్నతస్థాయి సమీక్ష..
-
Rambha Urvashi Menaka Teaser: అల్లరి నరేష్ కామెడీకి దేవకన్యలు తోడైతే.. టీజర్లో అసలు కథ ఇదే!
-
Astrology: ఆగస్టు 12 బుధవారం దినఫలాలు..
-
Suriya: నా ఆరు నెలల హైదరాబాద్ ప్రయాణం మరచిపోలేను
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..