Toxic: ‘టాక్సిక్’లో రొమాన్స్, వైలెన్స్ డోస్ ఎక్కువైందా? యష్ మూవీపై సోషల్ మీడియాలో హాట్ డిబేట్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Toxic: రాకింగ్ స్టార్ యష్ హీరోగా, గీతు మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’ (Toxic). ఈ చిత్రం విడుదలకు ముందే భారీ అంచనాలను సొంతం చేసుకుంది. అయితే సినిమా నుంచి విడుదలవుతున్న గ్లింప్స్, టీజర్, పాటల నేపథ్యంలో సోషల్ మీడియాలో మరో ఆసక్తికర చర్చ మొదలైంది. సినిమా ప్రమోషన్లో భాగంగా ఇప్పటివరకు విడుదలైన విజువల్స్‌లో రొమాన్స్, ఇంటిమేట్ సన్నివేశాలు, హై-వోల్టేజ్ యాక్షన్నే ఎక్కువగా చూపిస్తున్నారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇటీవల విడుదలైన ‘తబాహి’ పాటలో యష్, కియారా అద్వానీ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆ పాటపై చర్చ కొనసాగుతుండగానే మరో సాంగ్ విడుదల కావడంతో, ఈ సినిమా ప్రమోషన్ మొత్తం రొమాన్స్, వైలెన్స్ చుట్టూనే తిరుగుతోందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లేడీ డైరెక్టర్ గీతు మోహన్‌దాస్ ఇంత బోల్డ్‌గా, ఇంటెన్స్‌గా ఈ సన్నివేశాలను తెరకెక్కించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది.
‘కేజీఎఫ్: ఛాప్టర్ 2’ తర్వాత దాదాపు రెండేళ్ల విరామం తీసుకున్న యష్, గీతు మోహన్‌దాస్‌తో సినిమా ప్రకటించినప్పుడు కొంతమంది అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అయితే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్‌తో గీతు తన మార్క్‌ను చూపిస్తున్నారని, యువతను ఆకర్షించే విధంగా సినిమా ప్రచారాన్ని రూపొందించారని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇక ఈ చిత్రంలో యష్ సరసన నయనతార, కియారా అద్వానీ, తారా సుతారియా, హుమా ఖురేషి, రుక్మిణి వసంత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే కియారా, తారా సుతారియాపై చిత్రీకరించిన పాటలు విడుదలయ్యాయి. ఇంకా మిగిలిన హీరోయిన్లకు సంబంధించిన పాటలు కూడా రాబోతున్నాయనే వార్తలతో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే కొందరు నెటిజన్లు మాత్రం ఒకే సినిమాలో ఇంతమంది హీరోయిన్లు, వరుసగా రొమాంటిక్ పాటలు ఉండటం కథకు ఎంతవరకు ఉపయోగపడుతుందనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రొమాన్స్, వైలెన్స్‌తో ఓపెనింగ్స్ రావొచ్చేమో కానీ, సినిమా విజయాన్ని చివరకు కథ, కథనం మాత్రమే నిర్ణయిస్తాయని అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, యష్ గతంలో ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో “కుటుంబంతో కలిసి చూసే సినిమాలే చేయాలనుకుంటాను” అని చెప్పిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ, ఇప్పుడు ‘టాక్సిక్’లో కనిపిస్తున్న బోల్డ్ కంటెంట్‌పై సోషల్ మీడియాలో కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఇవన్నీ ప్రేక్షకుల అభిప్రాయాలు, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలు మాత్రమే. సినిమా విడుదలైన తర్వాతే ఈ ప్రచారానికి ఎంతవరకు నిజం ఉందో స్పష్టత రానుంది. కాగా, ‘టాక్సిక్’ చిత్రం ఆగస్టు 26 న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. సినిమా రిలీజ్ తర్వాత ఈ చర్చలకు సమాధానం దొరికే అవకాశం ఉంది.
Also Read
- Sigma Trailer: సందీప్ కిషన్ ‘సిగ్మా’ ట్రైలర్ వచ్చేసింది.. రూ.500 కోట్ల రాకెట్‌తో హీరో ఫైట్!
- Picnic: ప్రేమలు మేకర్స్ నుంచి మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్.. సంక్రాంతికి ‘పిక్నిక్’!
- Gondhal: ఆస్కార్ బరిలో మరాఠీ మూవీ.. బాలీవుడ్ సినిమాలను వెనక్కి నెట్టిన ‘గోంధల్’..
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
తాజావార్తలు
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
Shamshabad: శంషాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇన్నోవా బోల్తా పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి
-
Shruti Haasan: మగవాళ్లకు కూడా పీరియడ్స్ రావాలి.. వాళ్లకు ఆ బాధ తెలియాలి : శ్రుతి హాసన్ కామెంట్స్ వైరల్!
-
Oppo K14 Plus 5G: ఒప్పో K14 Plus 5G త్వరలో భారత్‌లో లాంచ్.. పనితీరు, డ్యూరబిలిటీపై ఫోకస్
-
Firecracker Shop Fire: వ్యాపార ప్రచారం కోసం రీల్.. బాణసంచా దుకాణంలో మంటలు, యజమాని మృతి
ట్రెండింగ్
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్‌పై భారత్ ఘన విజయం.. సెమీస్‌కు దూసుకెళ్లిన హర్మన్‌సేన..!