కొన్ని నెలల క్రితం ఫర్హాన్ అక్తర్ మూవీ ‘తుఫాన్’ అమెజాన్ ప్రైమ్ లో మే నెలలో స్ట్రీమింగ్ అవుతుందనే వార్తలు వచ్చాయి. అయితే సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని చిత్ర నిర్మాతలు ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. తాజాగా అమేజాన్ లో జూలై 16న ఇన్ స్పైరింగ్ స్పోర్ట్స్ డ్రామా ‘తూఫాన్’ ను స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఆ సంస్థ అధికారికంగా ప్రకటించింది. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వం వహించిన ఈ సినిమాను ఆయనతో పాటు రితేశ్ సిద్వానీ, ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. ఈ చిత్రాన్ని భారత్ తో పాటు 240కి పైగా దేశాలలో అమేజాన్ ప్రైమ్ వచ్చే నెల 16 స్ట్రీమింగ్ చేయబోతోంది. ‘భాగ్ మిల్కా భాగ్’ తర్వాత పర్హాన్, రాకేశ్ ఓంప్రకాశ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘తుఫాన్’పై భారీ అంచనాలే ఉన్నాయి. ముంబైలోని స్లమ్ ప్రాంతం డోంగ్రీ లో పుట్టి పెరిగిన ఓ అనాథ… బాక్సింగ్ ఛాంపియన్ గా ఎలా తయారయ్యాడన్నదే ఈ చిత్ర కథ. పరేశ్ రావేల్ తో పాటు మృణాల్ ఠాకూర్ ఇందులో కీలక పాత్రలు పోషించారు.