టామ్ క్రూజ్ ఈ పేరు వినగానే హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని డూపు లేకుండా చేసే హీరో గుర్తొస్తాడు. రస్కీ స్టంట్స్ ని కూడా అవలీలగా చేసే హీరో తెరపై కనిపిస్తాడు. ప్రస్తుతం వరల్డ్ సినిమాలో టామ్ క్రూజ్ రేంజులో యాక్షన్ సినిమాలు చేసే హీరో మరొకరు లేరంటే అతని స్థాయి ఏంటో అర్ధం చేసుకోవచ్చు. ‘మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్’తో వరల్డ్ ఆడియన్స్ ని దగ్గరైన టామ్ క్రూజ్, ఇటివలే నటించిన సినిమా ‘టాప్ గన్ మెవరిక్’. 170 మిలియన్ డాలర్స్ లో రూపొందిన ‘టాప్ గన్ మెవరిక్’ మూవీ గత ఏడాది మే 27న ప్రపంచ సినీ అభిమానుల ముందుకి వచ్చింది. బ్లాక్ బస్టర్ రివ్యూస్ సొంతం చేసుకున్న ఈ మూవీ ఓవరాల్ థియేటర్ రన్ లో 1.48 బిలియన్ డాలర్స్ రాబట్టింది. ఈ మూవీ తర్వాత తనకి టైలర్ మేడ్ అయిన మిషన్ ఇంపాజిబుల్ సినిమా మొదలు పెట్టేసాడు టామ్ క్రూజ్. మిషన్ ఇంపాజిబుల్ ఫ్రాంచైజ్ నుంచి ఇప్పటివరకు ఆరు సినిమాలు వచ్చాయి. పార్ట్ 7 అండ్ 8ని ‘మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్ పార్ట్ అండ్ పార్ట్ 2’ పేరుతో రిలీజ్ అవనున్నాయి.
ఈ రెండు భాగాలని క్రిస్టోఫర్ డైరెక్ట్ చేస్తున్నాడు. మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్ పార్ట్ వన్ జులై 12న ఆడియన్స్ ముందుకి రానుంది. 290 మిలియన్ డాలర్స్ బడ్జట్ తో రూపొందిన ఈ మూవీ ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేసారు. హ్యుజ్, గ్రాండ్, బ్రెత్ టేకింగ్… లాంటి పదాలు ఎన్ని వాడినా తక్కువే అనిపించే రేంజ్ యాక్షన్ ఎపిసోడ్స్ ని ట్రైలర్ లోనే చూపించారు మేకర్స్. ప్రస్తుతం ఫిల్మ్ లవర్స్ సాలిడ్ యాక్షన్ సినిమా చూడాలి అంటే టామ్ క్రూజ్ సినిమాకి వెళ్లిపోతే సరిపోతుంది అనే నమ్మకంలో ఉన్నారు. ఆ నమ్మకాన్ని మరోసారి నిజం చేసి చూపించింది మిషన్ ఇంపాజిబుల్ డెడ్ రెకొనింగ్ పార్ట్ వన్ ట్రైలర్. టామ్ చేసిన స్టంట్స్ కి థియేటర్ లో కూర్చున్న ఆడియన్స్ కి గూస్ బంప్స్ రావడం గ్యారెంటీ.