Tollywood This Week: ఈ ఇద్దరి పరిస్థితేంటి రాజా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈ వారం ఇద్దరు యంగ్ హీరోలకు ఎంతో కీలకంగా మారింది. మెగా హీరో వరుణ్ తేజ్, యంగ్ హీరో కార్తికేయ ఇద్దరు కూడా ఫ్లాపుల్లోనే ఉన్నారు. చివరగా ఎఫ్ 3తో సోసో రిజల్ట్ అందుకున్నప్పటికీ… ‘గని’ సినిమాతో మెప్పించలేకపోయాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రూపొందిన స్పై థ్రిల్లర్ ‘గాండీవధారి అర్జున’తో ఆడియెన్స్ ముందుకు రాబోతున్నాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా ఆగస్టు 25న రిలీజ్‌కు రెడీ అవుతోంది. ఈ సినిమా పై వరుణ్ మాత్రమే కాదు.. చివరగా ఘోస్ట్‌తో డిజాస్టర్ అందుకున్న ప్రవీణ్ సత్తారు కూడా భారీ ఆశలు పెట్టుకున్నాడు. ప్రస్తుతానికైతే మంచి ప్రమోషన్స్‌తోనే ఈ సినిమా ఆడియెన్స్ ముందుకి రాబోతోంది. ఇక ఆర్స్ ఎక్స్ 100 హీరో కార్తికేయ నటించిన ‘బెదురులంక 2012’ మూవీ కూడా 25నే థియేటర్లోకి రానుంది.
Read Also: Balayya: జై బోలో గణేష్ మహారాజ్ కీ అంటున్న ‘భగవంత్ కేసరి’
Also Read
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
- Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
- Jason Sanjay: నాన్న సీఎం అయినప్పుడు నా ఫీలింగ్ ఇదే.. : జాసన్ సంజయ్
కార్తికేయ, నేహా శెట్టి కలిసి నటించిన ఈ సినిమాకు క్లాక్స్ దర్శకత్వం వహించాడు. ఆర్ ఎక్స్ 100 తర్వాత కార్తికేయ ఎన్నో చిత్రాలు చేశాడు. కానీ ఒక్కటి కూడా ఆర్ ఎక్స్ 100 రేంజ్ హిట్ అందుకోలేదు. దాంతో ఈ సినిమాపైనే కార్తికేయ భారీ ఆశలు పెట్టుకున్నాడు. వరుణ్ తేజ్-కార్తికేయలు ఇప్పుడు పక్కా హిట్ కొట్టాల్సిన పరిస్థితులో ఉన్నారు. ఏ మాత్రం ఈ రెండు సినిమాల రిజల్ట్ తేడా కొట్టినా వరుణ్ అండ్ కార్తికేయ మార్కెట్ పూర్తిగా దెబ్బతినే ప్రమాదం ఉంది. ఇక ఇదే వారంలో మరో రెండు డబ్బింగ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన ‘కింగ్ ఆఫ్ కోతా’ ఆగస్ట్ 24న రిలీజ్ కానుంది. అలాగే ‘బాయ్స్ హాస్టల్’ అనే కన్నడ డబ్బింగ్ మూవీ కూడా ఈ వారంలోనే రిలీజ్ కానుంది. మరి వరుణ్ తేజ్, కార్తికేయ ఈ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అవుతారేమో చూడాలి.
తాజావార్తలు
-
The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని ‘ది ప్యారడైజ్’ టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
-
Adidas Layoffs: సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, డేటా సైంటిస్టులకు షాక్.. అడిడాస్‌లో 50% ఉద్యోగాల కోత
-
Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
-
Rashmika Mandanna: కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఇంత సడెన్‌గా ఆ డెసిషన్ ఎందుకు?
-
WPL 2027 Dates Announced: WPL 2027 షెడ్యూల్ వచ్చేసింది.. జనవరి 14 నుంచి మహిళా క్రికెట్ సమరం!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్‌ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!