Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Cinema News Tollywood Lyricist Kandikonda Passes Away

Knadikonda: మళ్ళీ కూయవే గువ్వా…!

Published Date :March 12, 2022 , 6:22 pm
By Roja Pantham
Knadikonda: మళ్ళీ కూయవే గువ్వా…!
  • Follow Us :
  • google news
  • dailyhunt

“మళ్ళీ కూయవే గువ్వా…మోగిన అందెలమువ్వ… తుళ్ళి పాడవే పువ్వా… గుండెల సవ్వడి మువ్వా…” – ఈ పాట అప్పట్లో కుర్ర కారు గుండెలను మీటింది. పూరి జగన్నాథ్ తెరకెక్కించిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లోని ఈ పాటతోనే గీత రచయిత కందికొండ యాదగిరి చిత్రసీమకు పరిచయమయ్యారు. తొలి చిత్రంలోనే తన కవితాశోభను జనానికి పరిచయం చేయగలిగారు కందికొండ. దర్శకుడు పూరి, సంగీత దర్శకుడు చక్రి సైతం ఆయనలోని ప్రతిభను ప్రోత్సహిస్తూ అదే చిత్రంలో “నీకోసం వేచి వేచి చూసిన వైనం…” అనే పాటనూ రాసే అవకాశం కల్పించారు. అక్కడ నుంచీ తనదైన బాణీ పలికిస్తూ కందికొండ యాదగిరి తన పాటల పల్లకిలో ప్రేక్షకులను ఊరేగించారు.

పాటే లోకం!
కందికొండ యాదగిరి 1973 అక్టోబర్ 13న వరంగల్ జిల్లా నాగుర్లపల్లిలో జన్మించారు. తెలంగాణ జానపదాలు పాడుకుంటూ, పాటలపై మక్కువ పెంచుకున్నారు కందికొండ. మాతృభాష తెలుగుపై విపరీతమైన అభిమానం పెంచుకొని, తెలుగు సాహిత్యంలోని పలు ప్రయోగాలను అధ్యయనం చేస్తూ పయనించారు. ఉస్మానియా యూనివర్సిటీలో చేరి, “సిట్యుయేషనల్ సాంగ్స్ ఫ్రమ్ తెలుగు సినిమా” (తెలుగు సినిమాల్లోని సందర్భోచిత గీతాలు) అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్ పట్టా అందుకున్నారు. తెలంగాణ ప్రాంతం నుంచే వచ్చిన సంగీత దర్శకుడు చక్రితో కందికొండ చదువుకొనే రోజుల్లోనే పరిచయం ఏర్పరచుకొన్నారు. అప్పట్లోనే కందికొండ తన ప్రాంతంపై అభిమానంతో అనేక పాటలు రాశారు. తమ ప్రాంతంలోని మట్టి మనుషుల వెతలను కళ్ళకు కట్టినట్టుగా కథలు రాశారు. కథలు, కవితలతో సాగిన కందికొండ చక్రి ప్రోత్సాహంతో చిత్రసీమలో గీత రచయితగానూ తనదైన బాణీ పలికించారు. చక్రి స్వరకల్పనలోనే కందికొండ పలు సూపర్ హిట్ సాంగ్స్ అందించారు. అలాగే కందికొండను దర్శకుడు పూరి జగన్నాథ్ సైతం విశేషంగా ప్రోత్సహించారనే చెప్పాలి.

పరవశింపచేసిన తీరు…
‘ఇడియట్’లో కందికొండ కలం పలికించిన “చూపుల్తో గుచ్చి గుచ్చి చంపకే…” పాట అప్పట్లో కుర్రాళ్ళ నోళ్ళలో నాట్యం చేసింది. ‘పోకిరి’లోని “గల గల పారుతున్న గోదారిలా…” గీతం యువతను భలేగా ఆకట్టుకుంది. అందులోని “జగడమే…” పాట యూత్ ను కట్టి పడేసింది. ఈ నాటికీ పోటీతత్వం పొడసూపిన ప్రతిసారీ ఆ గీతాన్ని మీడియా జనం విశేషంగా ఉపయోగించుకుంటున్నారు. “నీలి నీలి ముత్యమల్లె…” (ఆడుతూ పాడుతూ), “చెన్నై చంద్రమా…” (అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి), “రామా…రామా… నీలి మేఘశ్యామా…” (శివమణి), “మధురమే మధురమే…” (సత్యం), “అక్కడ్ బక్కడ్…”(సూపర్), “ఓ మేఘమాలా…”(సదా మీ సేవలో), “ఐ వన్నా స్పైడర్ మేన్…” (స్టాలిన్), “చినుకులాగా…” (అల్లరి పిడుగు), “నిన్నే నిన్నే…” (దేశముదురు), “మనసా నువ్వుండే చోటే చెప్పమ్మా…” (మున్నా), “గుండె గోదారిలా…” (మస్కా), “వన్ మోర్ టైమ్…” (టెంపర్) – వంటి కందికొండ పాటలు జనం మదిలో నిలచిపోయాయి. ఆయన కలం నుండి చివరగా జాలువారిన గీతం ఈ మధ్యే శ్రీకాంత్ హీరోగా వచ్చిన ‘కోతలరాయుడు’లోని “ఓ తలపై…” అంటూ సాగుతుంది.

వందలాది పాటలను పలికించిన కందికొండ తెలుగు చిత్రసీమ పాటల పర్వంలో తనకంటూ ఓ స్థానం సంపాదించారు. పసందైన పాటలు పలికిస్తూ సాగుతున్న తరుణంలో కందికొండను కేన్సర్ మహమ్మారి పట్టుకుంది. ఆయన సన్నిహితులు, ప్రభుత్వం తగిన సాయం అందించినా, చివరకు కందికొండ మార్చి 12న తుదిశ్వాస విడిచారు. ‘మళ్ళి కూయవే గువ్వా…’ అంటూ చిత్రసీమలో ప్రవేశించిన కందికొండ పాటను ప్రేమించిన వారందరూ ఆయన ఇక లేరన్న వార్త తెలిసి శోకంలో మునిగారు. ఈ పాటల గువ్వ మళ్ళీ కూయాలనే అందరూ అభిలషించారు. కానీ, ఇప్పటికే మధురం పంచిన కందికొండ కలం అభిమానుల గుండెల సవ్వడిలో ఓ మువ్వలా ఒదిగిపోయింది. ఆయన పాట గుర్తుకు వచ్చిన ప్రతీసారి ఆ మువ్వ మోగుతుంది… మళ్ళీ గువ్వ కూస్తుంది!

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • kandikonda
  • kandikonda yadagiri
  • passes-away
  • Special Story
  • telugu cinima

తాజావార్తలు

  • Samantha : ఈ రోజు నేను ఇంత ధైర్యంగా ఉన్నానంటే కారణం ఆయనే

  • Free House and Job: స్కూలుకు వెళ్లే పిల్లలు ఉంటే చాలు.. ఫ్రీ ఇల్లు, వెంటనే ఉద్యోగం.. ఈ ‘బంపర్ ఆఫర్’ ఎక్కడో తెలుసా?

  • Stock Market: భారీ నష్టాల్లో కొనసాగుతోన్న స్టాక్ మార్కెట్.. కారణమిదేనా?

  • BV Raghavulu: చంద్రబాబు, జగన్‌పై బీవీ రాఘవులు ఘాటు వ్యాఖ్యలు..

  • Artemis II: అంతరిక్షంలో రూ.192 కోట్ల విలువైన టాయిలెట్ జామ్.. గ్రౌండ్ టీమ్ ట్రబుల్‌షూటింగ్

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions