ఫ్యాన్ వార్స్ గురించి ప్రత్యేకించి ఈరోజు కొత్తగా చెప్పేది ఏముంది… ఎదో ఒక విషయంలో ఫాన్స్, తమ హీరోని డిఫెండ్ చేస్తూ, ఇంకో హీరోని ట్రోల్ చేస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు. ప్రతి హీరో ఫ్యాన్ ఇది డైలీ కర్యచరణలో భాగం అయిపొయింది. దశాబ్దాలుగా జరుగుతున్న ఈ ఆనవాయితీని ఇప్పటికీ ఫాన్స్ కొనసాగిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు ఏ హీరో సినిమా ఎన్ని రోజులు ఆడింది అని ఫ్యాన్ వార్ జరిగేది, అది నెమ్మదిగా ఎన్ని కోట్లు రాబట్టింది, మొదటి వీకెండ్ ని ఎవరి సినిమా ఎక్కువ కలెక్ట్ చేసింది, ఓపెనింగ్ డే రికార్డ్ ఎవరి పేరు పైన ఉంది, ఏ సెంటర్ లో ఎవరు ఎక్కువ వసూల్ చేస్తున్నారు, ఎవరి ఫస్ట్ లుక్ కి ఎక్కువ లైక్స్ వచ్చాయి, ఎవరు పేరు ఎక్కువ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది, బర్త్ డే రోజు కామన్ డీపీని ఎంత మంది రీట్వీట్ చేశారు, యుట్యూబ్ లో ప్రమోషనల్ కంటెంట్ ని ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఇన్స్టాలో ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు అని డిబేట్స్ చేసుకోని కొట్టుకోని, చంపుకునే వరకూ వచ్చాయి ఫ్యాన్ వార్స్. ఇలా రోజుకో టాపిక్ వెత్తుక్కోని మరీ గొడవపడే ఫాన్స్ కి కొత్తగా దొరికిన టాపిక్ ‘రాముడు ఎవరు అయితే బాగుంటుంది’. ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్ సినిమా నుంచి రీసెంట్ గా ఒక మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఇందులో ప్రభాస్ లుక్ అండ్ ‘జై శ్రీరామ్’ చాంటింగ్ వస్తున్న బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిరిపోయాయి. ప్రభాస్ ఫాన్స్ ని మాత్రమే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఆదిపురుష్ మోషన్ పోస్టర్ చూసి ఇంప్రెస్ అయ్యారు.
Read Also:KTR: త్వరలో రాష్ట్రంలో బీజేపీ ఖాళీ.. ఢిల్లీలో ప్రధాని కుర్చీ ఖాళీ
ఇక్కడి నుంచే అసలు రచ్చ మొదలయ్యింది, కొంతమంది ప్రభాస్ ఫాన్స్ ‘రాముడిగా ప్రభాస్ మాత్రమే బాగున్నాడు. రాముడు ఇలానే ఉండాలి, అంతే కానీ పొట్ట వేసుకోని ఎన్టీఆర్ లా ఉండకూడదు’ అంటూ కామెంట్స్ చేశారు. దీంతో నందమూరి ఫాన్స్ రంగంలోకి దిగి ‘ప్రభాస్ బాగున్నాడు కానీ ఎన్టీఆర్ ని అనడం కరెక్ట్ కాదు. ఆయన యుగపురుషుడు. రాముడైన, కృష్ణుడు అయినా, కర్ణుడు అయినా, దుర్యోధనుడు అయినా అది ఎన్టీఆర్ మాత్రమే. ఇప్పుడు విజువల్ ఎఫెక్ట్స్ వాడి ఏదేదో జిమ్మిక్కులు చేస్తున్నారు కానీ అవేమీ లేని రోజుల్లోనే ఎన్టీఆర్ పౌరాణిక వేషాలు వేశాడు’ అంటూ ట్రోలర్స్ కి స్ట్రాంగ్ రిప్లై ఇస్తున్నారు. ఈ మధ్యలో మెగా ఫాన్స్ జాయిన్ అయ్యి “ఆర్ ఆర్ ఆర్’ సినిమాలో రామ్ చరణ్ బాణాలు వేస్తూ, కాషాయ బాటల్లో అచ్చం రాముడిలా ఉన్నాడు. రాముడి పాత్రలో నటించాలి అంటే రామ్ చరణ్ తర్వాతే ఎవరైనా” అంటూ కామెంట్స్ పెడుతున్నారు. గత 48 గంటలుగా ఈ టాపిక్ పైన ఫ్యాన్ వార్ జరుగుతూనే ఉంది. ఇది ఎప్పుడు ఆగుతుంది? అసలు ఇలాంటి విషయాల్లో కూడా ఫ్యాన్ వార్ చేసుకోవచ్చు అనే అంత గొప్ప అలోచనలు ఫాన్స్ కి ఎలా వస్తాయి? అనేది అంతుబట్టని విషయమే.
Read Also:Imran Khan: పాకిస్థాన్ మాజీ ప్రధానే లక్ష్యం.. ఇమ్రాన్‌పై దాడికి ఉగ్రవాద సంస్థ ప్లాన్