టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఈడీ దర్యాప్తు ముమ్మరం చేసింది. నాలుగేళ్ల కిందట తెలుగు చిత్ర పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. మాదక ద్రవ్యాల రవాణా, మనీలాండరింగ్ కేసుకు సంబంధించి 12 మంది టాలీవుడ్ సెలబ్రెటీలకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 22 వరకు సినీ స్టార్స్ విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులు పంపించింది.
ఆయా తేదీల ప్రకారం వీళ్లంతా హాజరు కావాలని ఈడీ నోటీసులు జారీ చేసింది.