Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బర్త్ డే ఈ రోజు. పుష్ప-2తో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన తర్వాత వస్తున్న మొదటి పుట్టిన రోజు. అల్లు అర్జున్ అంటే ఇంతకు ముందు వేరు.. ఇప్పుడు వేరు. ఇప్పుడు ఆయన సినిమాలు అన్నీ పాన్ ఇండియా లేదంటే పాన్ వరల్డ్ స్థాయిలోనే ఉండబోతున్నాయి. అందుకే ఈ బర్త్ డే రోజు బ్లాస్టింట్ సినిమా అనౌన్స్ చేశారు. అట్లీ డైరెక్షన్ లో భారీ బడ్జెట్ తో కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. హాలీవుడ్ టెక్నీషియన్లు దీని కోసం పనిచేయబోతున్నారు. అయితే పుట్టిన రోజు సందర్భంగా అల్లు అర్జున్ కు సెలబ్రిటీలు బర్త్ డే విషెస్ చెప్పారు.
Naga Chaitanya : అక్కినేని అభిమానులు కాలర్ ఎగరేసుకునే స్క్రిప్ట్ సిద్ధమైందట!
జూనియర్ ఎన్టీఆర్ స్పెసల్ ట్వీట్ చేశాడు. ‘హ్యాపీ బర్త్ డే బావ. ఈ ఏడాది మరిన్ని విజయాలు, శక్తి సాధించాలి’ అంటూ రాసుకొచ్చాడు. దానికి బన్నీ రిప్లై ఇస్తూ.. ‘ థాంక్యూ బావ. నీ ప్రేమకు ధన్యవాదాలు’ అంటూ తెలిపాడు.
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ట్వీట్ చేస్తూ.. ‘అనుకన్నది సాధించే వరకు శ్రమించే వ్యక్తి. మా రవీంద్ర నారాయణ్, విరాజ్, బంటుకు జన్మదిన శుభాకాంక్షలు’ అంటూ చెప్పాడు.
డైరెక్టర్ అట్లీ.. ‘హ్యాపీ బర్త్ డే అల్లు అర్జున్ సార్. మీరు సాధించిన విజయాలు మిమ్మల్ని ఈ స్థాయిలో నిలిపాయి. మన జర్నీ స్టార్ట్ అవుతున్నందుకు థాంక్స్’ అంటూ ట్వీట్ చేశాడు.
వీరితో పాటు నిర్మాత నాగవంశీ స్పెషల్ ట్వీట్ చేశాడు. త్రివిక్రమ్, అల్లు అర్జున్ సినిమాను అనౌన్స్ చేస్తూ ఓ పోస్టర్ ను రిలీజ్ చేశాడు. బన్నీకి బర్త్ డే విషెస్ చెప్పాడు.
వీరితో పాటు టాలీవుడ్ కు చెందిన హీరోలు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు, నటీనటులు కూడా విషెస్ తెలిపారు.