Tollywood: టాలీవుడ్’కు ఈ ఏడాది బిగ్ షాక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమ పాన్ ఇండియాలో టాప్ పొజిషన్లో ఉంది. ఎప్పుడైతే రాజమౌళి బాహుబలి చేశాడో, అప్పటి నుంచి మన సినిమాలకు, మన వాళ్ళు రాసే కథలకు డిమాండ్ పెరిగిపోయింది. బాహుబలి తర్వాత పుష్ప ఆ లెగసీని కంటిన్యూ చేస్తూ ఇండస్ట్రీ రికార్డులను క్రియేట్ చేసింది. దాంతో మన దర్శకుల కోసం ఇతర భాషల హీరోలు ఎదురు చూడటం, మన హీరోల కోసం బాలీవుడ్ దర్శకులు ఎదురు చూసే రోజులు వచ్చాయి. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ అంటే పట్టించుకోని బాలీవుడ్ వాళ్ళు, ఇప్పుడు మన కథల కోసం, మన సినిమాల కోసం ఎదురుచూడటం నిజంగా చాలా గొప్ప విషయం… అయితే గత కొన్ని సంవత్సరాల నుంచి బాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తున్న మన సినిమాలు ఈ సంవత్సరం మాత్రం పూర్తిగా వెనకబడిపోయాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇండస్ట్రీ రికార్డులను కొల్లగొడుతున్న తెలుగు ఇండస్ట్రీకి ఏమైంది? ఈ సంవత్సరం ప్రభాస్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు వచ్చారు. అలాగే చిరంజీవి లాంటి సీనియర్ హీరో కూడా ‘మన శంకర వర ప్రసాద్’ మూవీతో బాక్సాఫీస్ వద్ద పెను సంచలనాన్ని క్రియేట్ చేసినప్పటికీ, కేవలం తెలుగులోనే సత్తా చాటాడు. కానీ పాన్ ఇండియాలో ఆయనకి పెద్దగా మార్కెట్ లేకపోవడం వల్ల ఆయన సినిమా పాన్ ఇండియా రిలీజ్‌కి నోచుకోలేదు. తెలుగులో మాత్రం 400 కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టి మెగాస్టార్ తన సత్తా చాటుకున్నాడు…
ప్రభాస్ హీరోగా చేసిన ‘రాజాసాబ్’ సినిమా ఈ ఇయర్ సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కథలో వైవిధ్యం లోపించడం, ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ ఇమేజ్ ఉన్న హీరోకి సరిపడా కథ లేకపోవడంతో ఈ మూవీ పూర్తిస్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. డైరెక్టర్ మారుతి ప్రభాస్‌ను డిఫరెంట్‌గా చూపిస్తానని చెప్పి ప్రేక్షకులను ఎంగేజ్ చేయలేని సినిమా చేశాడు. ఈ సినిమా రిజల్ట్‌తో ప్రభాస్ అభిమానులు అవకాశం వచ్చిన ప్రతిసారి మారుతి మీద నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి స్టార్ హీరో డేట్స్ ఇచ్చినప్పుడు చేయాల్సిన సినిమా ఇది కాదని సినీ విమర్శకులు సైతం మారుతి మీద కొన్ని విమర్శలు చేశారు…
Also Read
రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో నటుడిగా తనకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడు… ఈ మూవీతో పాన్ ఇండియా ప్రేక్షకులను అలరించడమే కాకుండా గ్లోబల్ స్టార్‌గా అవతరించాడు. ఆ తర్వాత శంకర్ డైరెక్షన్లో చేసిన ‘గేమ్ ఛేంజర్’ మూవీ ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. దాంతో ‘ఉప్పెన’ మూవీతో దర్శకుడిగా తన సత్తా చాటుకున్న బుచ్చిబాబు డైరెక్షన్లో ‘పెద్ది’ మూవీ చేశాడు. ఈ సినిమాతో తనలోని సరికొత్త నటుడిని బయటికి తీసినప్పటికీ, ఎమోషనల్‌గా ఈ మూవీ పూర్తి స్థాయిలో ప్రేక్షకుడికి కనెక్ట్ కాలేకపోయింది. అలాగే సినిమాలోని కాన్ఫ్లిక్ట్ అంత ఎఫెక్టివ్‌గా లేకపోవడం, అందులోని సన్నివేశాలు సైతం ప్రేక్షకులను పూర్తిస్థాయిలో మెప్పించలేకపోయింది.
ఈ సంవత్సరం తెలుగు సినిమాలేవీ కూడా ఆశించిన సక్సెస్‌లను సాధించలేదు. దాంతో బాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రణ్వీర్ సింగ్, రణబీర్ కపూర్ ఇద్దరూ వాళ్ళ సినిమాలతో ప్రభాస్, రామ్ చరణ్‌లను డామినేట్ చేశారు. రణ్వీర్ సింగ్ ‘దురంధర్ 2’ మూవీతో 1700 కోట్ల కలెక్షన్స్‌ను కొల్లగొట్టాడు. అలాగే రణబీర్ కపూర్ ‘రామాయణ’ మూవీతో 1600 కోట్లకు పైన కలెక్షన్స్‌ను సాధించాడు. ఈ మూవీ ఇంకా సక్సెస్‌ఫుల్‌గా ప్రదర్శితమవుతుంది. లాంగ్ రన్లో 1800 కోట్ల వరకు కలెక్షన్స్‌ను కొల్లగొట్టే అవకాశం ఉంది. మొత్తానికైతే బాలీవుడ్ హీరోలు ఈ ఇయర్ మన హీరోలను డామినేట్ చేశారు. వచ్చే ఏడాదైనా మన సినిమాలు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాయాలని కోరుకుందాం…
తాజావార్తలు
-
Tollywood: టాలీవుడ్’కు ఈ ఏడాది బిగ్ షాక్
-
Niharika Konidela : ఆడియో కంపెనీలకు చెక్ పెడుతూ నిహారిక సంచలన నిర్ణయం
-
UP Elections 2027: యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ భారీ డిమాండ్.. ఎస్పీకి 130 స్థానాల జాబితా!
-
Woman Adopts Pig : పదేళ్ల పెళ్లి బంధానికి గుడ్‌బై.. పందిపిల్లతో కొత్త జీవితం
-
China-Bangladesh: చైనా నుంచి బంగ్లాదేశ్‌కు క్షిపణి ఇంధన రసాయనం? పట్టుకున్న ఇండోనేషియా నేవీ!
ట్రెండింగ్
-
200MP కెమెరా, 9000mAh బ్యాటరీ, OLED డిస్ప్లేలతో HONOR 700 Series లాంచ్..!
-
Indian Rupee Falls: మళ్లీ పడిపోయిన రూపాయి.. ఒక్కరోజే 23 పైసలు పతనం..!
-
Mohammed Siraj-Gill: సిరాజ్‌ను అందుకే పక్కనపెట్టాం.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!
-
WTC పాయింట్ల పట్టికలో భారత్‌కు భారీ షాక్.. టాప్-2 నుంచి న్యూజిలాండ్ ఔట్..!
-
Shubman Gill: అందుకే ముందుగానే డ్రాకు అంగీకరించా.. శుభ్‌మన్ గిల్ కీలక వ్యాఖ్యలు!