Title Concept Poster of their next “AMMA” directed by RJ Swetha PVS: విజయ్ దేవరకొండ మేనమామ, నిర్మాత యష్ రంగినేని సారథ్యంలో పెళ్లి చూపులు, డియర్ కామ్రేడ్, దొరసాని, అన్నపూర్ణ ఫొటో స్టూడియో వంటి సక్సెస్ ఫుల్ సినిమాలను నిర్మించిన బిగ్ బెన్ సినిమాస్ సంస్థ తమ ప్రొడక్షన్ నెం.7 గా అమ్మ మూవీని నిర్మిస్తోంది. ఈ రోజు మదర్స్ డే సందర్భంగా అమ్మ సినిమాను అనౌన్స్ చేశారు. ఇక ఈ సినిమాతో ఆర్జే శ్వేత పీవీఎస్ దర్శకురాలిగా పరిచయం అవుతున్నారు. ఇక ఎమోషనల్ థ్రిల్లర్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది.
Mamata Banerjee: గవర్నర్ ఎడిట్ చేసిన వీడియోను ప్రజలకు చూపించారు..
అమ్మ మూవీ అనౌన్స్ మెంట్ సందర్భంగా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ టైటిల్ పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. అమ్మ ఫొటో బ్యాక్ డ్రాప్ లో అగ్ని జ్వాలల మధ్య పంజరం, పక్షి ఫొటోతో ఈ పోస్టర్ డిజైన్ చేశారు. మదర్ సెంటిమెంట్ తో సరికొత్త ఎమోషనల్ థ్రిల్లర్ మూవీగా అమ్మ సినిమా ఉండనుంది, ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు మేకర్స్.