‘హరిహర వీరమల్లు’, ‘శాకుంతలం’తో తెలుగు ఆడియో రంగంలోకి టిప్స్ మ్యూజిక్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ నుంచి రాబోతున్న ప్రతిష్టాత్మక చిత్రాలు ‘శాకుంతలం’, ‘హరిహర వీరమల్లు’ గ్లోబల్ మ్యూజిక్ హక్కులను టిప్స్ ఇండస్ట్రీస్ చేజిక్కించుకుంది. ఈ రెండు చిత్రాలు 2022లో ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద సంగీత సంస్థల్లో ఒకటైన టిప్స్ ఇండస్ట్రీస్ కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రెండు బిగ్ ప్రాజెక్ట్స్ మ్యూజిక్ రైట్స్ పొంది సరికొత్త ఉత్సాహంతో మరో సంచలనం సృష్టించింది. ఇప్పటికే ‘శాకుంతలం’, ‘హరి హర వీర మల్లు చిత్రాల గ్లింప్స్ విడుదలై ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో ఈ సినిమాల మ్యూజికల్ టీజర్స్‌పై ఆసక్తి రెట్టింపయింది. పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ పీరియాడికల్ యాక్షన్- అడ్వెంచర్ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్ కీల పాత్ర పోషిస్తున్నాడు. తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో ఏప్రిల్ నెలలో గ్రాండ్‌గా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.
Read Also : ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్
Also Read
- Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
- Bobby Deol: అప్పటివరకు సరైన హిట్ లేదు.. ‘యానిమల్’తో ఓవర్‌నైట్ సెన్సేషన్.. ఇప్పుడు ఆ ఇమేజ్‌పై పోరాటం!
- Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
- Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
ఇక కాళిదాసు రచించిన ప్రముఖ భారతీయ నాటకం ‘శకుంతల’ ఆధారంగా పౌరాణిక ప్రేమకథా చిత్రంగా ‘శాకుంతలం’ మూవీ రూపుదిద్దుకుంటోంది. మూవీ రూపొందింది. గుణశేఖర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను గుణ టీమ్‌వర్క్స్, దిల్ రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నీలిమా గుణ, దిల్ రాజు నిర్మించారు. దీనికి సంగీత స్వరకర్త మణిశర్మ స్వరరచన చేశారు. ఈ చిత్రంలో సమంత లీడ్ రోల్ పోషించగా కురు వంశపు రాజు దుష్యంతుడిగా ప్రముఖ మలయాళ నటుడు దేవ్ మోహన్ నటించారు. మోహన్ బాబు, సచిన్ ఖేడేకర్, గౌతమి, అదితి బాలన్, అల్లు అర్హ, అనన్య నాగళ్ళ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.
Read Also : బుక్ మై షో దోపిడీని అరికట్టాలి : తమ్మారెడ్డి భరద్వాజ
ఈ సందర్భంగా టిప్స్ మ్యూజిక్ అధినేతలు కుమార్ తౌరానీ, గిరీష్ తౌరానీ మాట్లాడుతూ , ”ఎన్నో సంవత్సరాలుగా భారతీయ చలనచిత్ర పరిశ్రమ అంతటా ఎన్నో అద్భుతమైన భారీ చిత్రాలని నిర్మించిన సంస్థ టిప్స్. అంతే కాకుండా పాటలు, సంగీతాన్ని అందించిన టిప్స్ మ్యూజిక్ అదే సంప్రదాయాన్ని కొనసాగిస్తూ, అదే నిబద్ధతతో ప్రస్తుతం తెలుగు సినీ రంగంలోకి ప్రవేశించింది. ఇకపై తెలుగు చిత్రాల ఆడియో హక్కులతో పాటు అన్ని భారతీయ భాషల ఆడియో హక్కులను కొనడానికి సిద్ధంగా వుంది. కేవలం భారీ చిత్రాలనే కాకుండా చిన్న చిత్రాలు సైతం మా సంస్థ ఆడియో విడుదల చేయడానికి ముందుంటుంది. ఈ రెండు భారీ చిత్రాల ఆడియో హక్కులే కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ సాయి కార్తీక్ డి.టి.ఎస్ (డేర్ టూ స్లీప్) మణి శంకర్, లాంప్, రా రా పెనిమిటి, ధగఢ్ సాంబా, పరమపద సోపానం, యు ఆర్ మై హీరో, మై నేమ్ ఈజ్ శ్రుతి’ చిత్రాల ఆడియో హక్కులు పొంది ఉన్నాం. ఇప్పటికే మా టిప్స్ యు ట్యూబ్ ఛానల్ కు 51 మిలియన్ సభ్యులు వున్నారు. మా మిత్రుడు ‘సుప్రీం’ రాజు హార్వాణి సౌత్ ఇండియన్ మూవీస్ వ్యాపార లావాదేవీలను నిర్వహిస్తారు” అని అన్నారు.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!