ఇద్దరి మంచికే… సామ్ తో డివోర్స్ పై నాగ చైతన్య ఫస్ట్ రియాక్షన్

అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్య, స్టార్ హీరోయిన్ సమంత విడాకుల విషయం ఇంకా హాట్ టాపిక్ గానే ఉంది. వీరిద్దరి గురించి గాసిప్స్ తగ్గలేదు, అలాగే అసలు ఎందుకు విడాకులు తీసుకున్నారు ? అనే విషయంపై ఆసక్తీ తగ్గలేదు. ఎందుకంటే వీరిద్దరూ విడిపోతున్నాం అనే విషయాన్ని అయితే అధికారికంగానే ప్రకటించారు. కానీ ఎందుకు ? అనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ఇవ్వాల్సిన అవసరం కూడా లేదనుకోండి ! కానీ వీరిద్దరి అభిమానులతో పాటు అందరిదీ అదే ప్రశ్న. వాస్తవానికి వీళ్ళిద్దరూ విడిపోవడం అభిమానులకు ఇష్టం లేదు. కానీ జీవితం వాళ్ళది… నిర్ణయం వాళ్ళది…!! చూడముచ్చటైన జంట ఇలా విడిపోతుంటే చాలామంది బాధపడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకూ నాగ చైతన్య గానీ, సమంత గానీ విడాకుల విషయాన్ని ప్రకటించిన తరువాత మరెక్కడా ఆ విషయం గురించి ప్రస్తావించలేదు. కానీ తాజాగా నాగ చైతన్య విడాకులపై నోరు విప్పారు.

Read Also : ‘డోంట్ మ్యారీ… బీ హ్యాపీ’… నాగ చైతన్య ఫుల్ చిల్

ప్రస్తుతం నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బంగార్రాజు’ సంక్రాంతి కానుకగా విడుదలకు సిద్ధంగా ఉంది. జనవరి 14న విడుదల కానున్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నారు టీం. ఇందులో భాగంగానే నాగ చైతన్యకు విడాకుల విషయం గురించి ప్రశ్న ఎదురవ్వగా… “అది ఇద్దరి మంచి కోసం తీసుకున్న డెసిషన్… ఆమె సంతోషంగా ఉంది… నేనూ సంతోషంగా ఉన్నాను… ఈ సిట్యుయేషన్ లో ఇది ఇద్దరికీ బెస్ట్ డెసిషన్” అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య చెప్పిన విధానం చూస్తుంటే నిజంగా ఈ నిర్ణయంతో ఆయన సంతోషంగానే ఉన్నట్టుగా కన్పిస్తోంది.

Related Articles

Latest Articles