Tillu Square First Review Given by Siddhu Jonnalagadda: గతంలో సూపర్ హిట్ లుగా నిలిచిన సినిమాలకు సీక్వెల్స్ తెరకెక్కిస్తూ ఉంటారు మేకర్స్. అదే కోవలో డీజే టిల్లు సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో టిల్లు స్క్వేర్ పేరుతో ఒక సినిమా తెరకెక్కింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ ఈ సినిమా తెరకెక్కింది. సినిమా నుంచి రిలీజ్ అయిన మొదటి టీజరే కాస్త బోల్డుగా ఉండడంతో పాటు ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలా కనిపించిన అనుపమని ఒక గ్లామర్ భామగా చూపించడంతో ఒక్కసారిగా సినిమా మీద ఆసక్తి ఏర్పడింది. మార్చి 29వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపద్యంలో ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది సినిమా యూనిట్.
Samantha: చరణ్‌కు విషెష్ చెప్పిన సామ్.. కొత్త అనుమానం రేపిందేంటి?
ఈ నేపథ్యంలో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ రివ్యూ తానే ఇచ్చేశాడు ఈ సినిమా హీరో, రచయిత సిద్దు జొన్నలగడ్డ. తాజాగా ఈ సినిమా నిర్మాత నాగ వంశీ, హీరో హీరోయిన్లు సిద్దు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ యాంకర్ సుమతో ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. ఇదే ఇంటర్వ్యూలో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ తన సినిమాకి తానే రివ్యూ ఇచ్చేశాడు. అసలు తన సినిమా ఎందుకు చూడాలనే విషయం మీద ఆయన క్లారిటీ ఇచ్చాడు. సినిమాకి ఒక మంచి అద్భుతమైన స్టోరీ ఉంటుందని, ఫస్ట్ ఆఫ్ ఎంత ఎంటర్టైన్ చేస్తుందో సెకండ్ హాఫ్ కూడా అంతే ఎంటర్టైన్ చేసేలాగా బ్యాలెన్స్ చేశామని చెప్పాడు. అలాగే ఇంటర్వెల్ బ్యాంగ్ అయితే క్రేజీగా ఉంటుందని సిద్ధూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా ప్రీ క్లైమాక్స్ లో ఒక అద్భుతమైన సర్ప్రైజ్ ఉంటుందని క్లైమాక్స్ కూడా ఎవరూ ఊహించని విధంగా ఉంటుందని అన్నాడు. అలాగే ఈసారి కూడా గతం కంటే ఎక్కువగానే సాలిడ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నామని కచ్చితంగా ఈ సినిమాతో మరో హిట్ కొడతానని చాలా కాన్ఫిడెంట్ గా చెబుతున్నాడు.