Samantha wishes Ram Charan as OG on his Birthday: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ పుట్టినరోజు కావడంతో ఈ రోజు పెద్ద ఎత్తున ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా శిల్పకళా వేదిక లో పెద్ద ఎత్తున ఈ వేడుకలు గ్రాండ్ గా జరుగుతున్నాయి. ఇక తన పుట్టినరోజు సందర్భంగా మెగా పవర్ స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ గా మారిన రామ్ చరణ్ నిన్న రాత్రి బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్పెషల్ ఫ్లైట్ లో తిరుపతి వెళ్లారు. ఈ ఉదయాన్నే తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన తన భార్య ఉపాసన క్లీంకారతో కలిసి మరల హైదరాబాద్ తిరిగి వచ్చారు. హైదరాబాద్ తిరిగి వచ్చిన రామ్ చరణ్ తేజని, సినీ ప్రముఖులు, సినీ జర్నలిస్ట్ లు కలిసి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. సోషల్ మీడియాలో సైతం రామ్ చరణ్ తేజకు పుట్టినరోజు శుభాకాంక్షలు వెల్లువలా కురుస్తున్నాయి.
Renu Desai: యోధుడిలా పవన్ కల్యాణ్ తనయుడు అకీరా.. వీడియో పోస్ట్ చేసిన రేణు దేశాయ్
అయితే ఇక్కడ ఒక ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆయనతో రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలో నటించిన సమంత విషెస్ చెబుతూ ఒకసారిగా కొత్త అనుమానం రేకెత్తించింది. అసలు విషయం ఏమిటంటే సమంత, రామ్ చరణ్ తేజకి తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా విషెస్ చెప్పింది. విషెస్ చెబుతూ రాంచరణ్ సూట్ లో ఉన్న ఒక పిక్ షేర్ చేసి హ్యాపీ బర్త్డే ఓజీ అంటే ఒరిజినల్ గ్యాంగ్ స్టార్, నీలాగా ఇంకెవరూ లేరు అంటూ ఆమె కామెంట్ చేసింది. సాధారణంగా ఇలా విష్ చేస్తే పెద్దగా అనుమానాలు ఏమీ ఉండవు కానీ ఒరిజినల్ గ్యాంగ్ స్టార్ ఓజీ పేరుతో పవన్ కళ్యాణ్ ఒక సినిమా చేస్తున్నారు. అదే పదాన్ని ప్రస్తావిస్తూ రామ్ చరణ్ తేజ కి సమంత విషెస్ చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ అవ్వడమే కాదు సోషల్ మీడియాలో చర్చనీయాంశం కూడా అయింది.