మూవీ మేకింగ్ మాస్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా, తమిళ ప్రజల బాహుబలిగా ఏప్రిల్ 28న రిలీజ్ అవుతోంది పొన్నియిన్ సెల్వన్ 2. ఇతర భాషల్లో PS-2 గా రిలీజ్ అవుతున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే రెండు సాంగ్స్ రిలీజ్ అయ్యి మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. లేటెస్ట్ గా PS-2 నుంచి ‘శివోహం’ అంటూ సాగే మూడో సాంగ్ రిలీజ్ అయ్యింది. జగత్ గురువు అదిశంకరా చార్యులు రాసిన ‘నిర్వాణ శతకం’ నుంచి శివోహం చాంటింగ్ ని తీసుకోని వాటికి పాట రూపం ఇచ్చాడు రెహమాన్. నిర్వాణ శతకం నుంచి పుట్టిన ఈ పాట లిరిక్స్ కి, రెహమాన్ కంపోజ్ చేసిన గూస్ బంప్స్ ఇచ్చే ట్యూన్ కి ప్రాణం పోసారు సింగర్స్. సత్య ప్రకాష్, నారాయణన్, శ్రీకాంత్ హరిహరన్, నివాస్, అరవింద్ శ్రీనివాస్, బాగారాజ్, అయ్యప్పన్ ల వోకల్స్ ‘శివోహం’ సాంగ్ ని ఈ జనరేషన్ వాళ్లు కూడా పాడుకునేలా చేసింది.
అఘోరాలు, శివ సాధువులు ఉన్న ఈ విజువల్స్ చూస్తే అరుణ్ మొలి చనిపోయాడు అనే వార్త చోళ రాజ్యంలో స్ప్రెడ్ అయిన తర్వాత ‘మధురాంతకన్’ సింహాసనం అధిరోహించే వారసుడిగా ఎన్నిక అయ్యే సీన్ లా కనిపిస్తోంది. ఈ సీన్ తర్వాతే అరుణ్ మొలి చనిపోలేదు అని తెలియడం రివీల్ అవుతుంది. ఓవరాల్ గా పొన్నియిన్ సెల్వన్ 2 సినిమా సాంగ్స్, ట్రైలర్ తో అయితే మెప్పించింది. మరి ఏప్రిల్ 28న థియేటర్స్ లో సినీ అభిమానులని ఎంత వరకూ ఆకట్టుకుంటుంది అనేది చూడాలి. పొన్నియిన్ సెల్వన్ 1 తరహాలో పార్ట్ 2 సక్సస్ కూడా తమిళనాడుకి మాత్రమే పరిమితం అవుతుందా? లేక పాన్ ఇండియా హిట్ గా పొన్నియిన్ సెల్వన్ 2 నిలుస్తుందా అనేది చూడాలి.