Site icon NTV Telugu

Allari Naresh: ‘ఉగ్రం’ వాయిదా! ‘రామబాణం’తో ఢీ!!

Ugram

Ugram

Ugram: ‘అల్లరి’ నరేష్‌ హీరోగా విజయ్‌ కనకమేడల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం ‘ఉగ్రం’. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం ‘నాంది’ సూపర్ హిట్‌ కావడంతో ‘ఉగ్రం’ మీద కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించిన ఈ సినిమాను ఏప్రిల్ 14న విడుదల చేయాలని తొలుత మేకర్స్ అనుకున్నారు. అయితే ఈ సినిమాను ఇప్పుడు మే 5వ తేదీకి వాయిదా వేశారు. ఈ విషయాన్ని హీరో ‘అల్లరి’ నరేశ్ తెలియచేస్తూ, “ఎన్నో సమ్మర్స్ నేను మీ హృదయాలను గెలుచుకున్నాను. అయితే ఈ సమ్మర్ లో మీరు నా ఉగ్రరూపం చూడబోతున్నారు” అని పేర్కొన్నాడు. మిర్నా హీరోయిన్ గా నటిస్తున్న ‘ఉగ్రం’ చిత్రానికి తూము వెంకట్ కథను అందించగా, అబ్బూరి రవి డైలాగ్స్ రాశారు . శ్రీచరణ్ పాకాల సంగీతం అందించగా, సిద్ సినిమాటోగ్రాఫర్ గా పని చేశారు. అయితే… మే 5వ తేదీన గోపీచంద్ హీరోగా శ్రీవాస్ తెరకెక్కించిన ‘రామబాణం’ సినిమా కూడా విడుదల కాబోతోంది.

Exit mobile version