This Star Heroine Was First Choice For Rainbow Movie: కన్నడ బ్యూటీ రష్మికా మందణ్ణను అదృష్టానికి మారుపేరుగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే.. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అనతికాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఆ వెంటనే నేషనల్ క్రష్ అనే ట్యాగ్‌ని సొంతం చేసుకుంది. ఇక అప్పటినుంచి ఈ అమ్మడికి భాషా బేధాలు లేకుండా భారీ ఆఫర్లు ఒకదానికి తర్వాత మరొకటి వచ్చిపడుతున్నాయి. ఇప్పుడు ఈ భామ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేసే స్టేజ్‌కి చేరుకుంది. రెయిన్‌బో అనే టైటిల్ ఖరారు చేసిన ఈ సినిమాను ఈరోజే (03-04-23) హైదరాబాద్‌లో లాంచ్ చేశారు. కొత్త దర్శకుడు శాంతారూబన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో.. మలయాళ నటుడు దేవ్ మోహన్ కథానాయకుడిగా నటిస్తున్నాడు.
Anasuya: ఆంటీ వివాదంపై అనసూయ రియాక్షన్.. కోపానికి కారణం అదే!
ఇకపోతే.. లేటెస్ట్‌గా ఈ రెయిన్‌బో సినిమా గురించి ఒక ఇంట్రెస్టింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ రొమాంటిక్ ఫ్యాంటసీ డ్రామాకు రష్మికా మందణ్ణ ఫస్ట్ ఛాయిస్ కాదట. ఆమె కంటే ముందు ఈ సినిమా కోసం స్టార్ హీరోయిన్ సమంతని సంప్రదించారు. ఆమెతో ఈ సినిమా చేయబోతున్నామని గతేడాది అక్టోబర్‌లో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ సంస్థ అధికారికంగా ప్రకటించింది కూడా! అయితే.. కొన్ని అనుకోని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ ఆలస్యం అవుతూ వచ్చింది. ఇప్పుడు ఇన్నాళ్ల తర్వాత సమంతను తొలగించి, ఆమె స్థానంలో రష్మికాను తీసుకొని ప్రాజెక్ట్‌ని తిరిగి ప్రకటించారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఏప్రిల్ 7వ తేదీ నుంచి కొనసాగనుంది. ఈ సినిమాను ఎస్ఆర్ ప్రకాశ్ బాబు, ఎస్ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Daggubati Abhiram: తేజ ‘అహింస’ ఈవారం లేనట్టేగా!