Site icon NTV Telugu

Sankranthi 2025 : సంక్రాంతికి అందాల జాతర చేసేందుకు రెడీ అయిన భామలు

Tollywood

Tollywood

టాలీవుడ్ నెక్ట్స్ సంక్రాంతికి రిలీజయ్యే సినిమాల లిస్ట్ లిమిటెడ్ నుండి అన్ లిమిటెడ్‌కు చేరుకుంది. ఆల్మోస్ట్ పొంగల్ సీజన్ ఫుల్ ఫాక్డ్‌. ప్రభాస్ టు శర్వానంద్ వరకు బరిలో దిగే హీరోలంతా జస్ట్ డేస్ గ్యాప్‌తో పోటీపడుతున్నారు. హీరోల మధ్య ఈ లెవల్లో కాంపిటీషన్ ఉంటే.. మరీ హీరోయిన్స్ మధ్య ఉండదా. ఆ లిస్ట్ చాంతాడంత ఉంది. ఫస్ట్ ఫస్ట్ పండుగకు కళ తీసుకురాబోతున్నారు గ్లామరస్ గర్ల్స్ మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్. జనవరి 9న రిలీజయ్యే రాజా సాబ్‌తో ఆడియన్స్‌కు మస్త్ ట్రీట్ ఇవ్వబోతున్నారు. ఈ ముగ్గురు కెరీర్స్‌కు ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫిల్మ్.

Also Read : Jana Nayagan : జననాయగన్ ఎఫెక్ట్.. ప్రైమ్ లో No – 1 లో ట్రెండింగ్ అవుతున్న భగవంత్ కేసరి

ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ పట్టేసిన అనిల్ రావిపూడి ఈ సారి పండుగకు బిగ్ బాస్ చిరంజీవిని.. విక్టరీ వెంకటేష్‌ను కలిపి తెస్తున్నాడు. ఇక చిరుకు జోడీ నయనతారను సెట్ చేశాడు. ప్రమోషన్లే చేయని నయన్‌ కూడా.. అనిల్ ఏ మాయ మాటలు చెప్పాడో.. ఫస్ట్ నుండి ప్రమోషన్ స్టార్ట్ చేసింది. అలాగే కేథరిన్ థెరిస్సా కూడా మూవీకి అదనపు ఆకర్షణ కాబోతుంది. ఇక రవితేజ హైపర్‌కు గ్లామరస్ బ్యూటీలు డింపుల్ హయాతి అండ్ ఆషికా రంగనాథ్ మరింత కలర్ అద్దబోతున్నారు. డస్కీ బ్యూటీ డింపుల్ ఫ్యామిలీ లుక్స్‌లో కనిపించినా.. ఆషికా గ్లామర్ షోతో ఆడియన్స్ అటెన్షన్ గ్రాబ్ చేసేందుకు రెడీ అవుతోంది. డబ్బింగ్ చిత్రాలతో కాంపిటీటర్లుగా మారుతున్నారు పూజా హెగ్డే, మమితా బైజు అండ్ శ్రీలీల. జననాయగన్‌, పరాశక్తి ఒకరోజు గ్యాప్ లో ఆడీయన్స్ ముందుకు రాబోతున్నాయి.  నెక్ట్స్ పొంగల్ బరిలో లక్ టెస్ట్ చేసుకుంటున్న ఇంత మంది మహాలక్ష్ముల్లో.. ఏ మహాలక్ష్మీకి సిరిమాలక్ష్మీ అనుగ్రహం దక్కుతుందో చూడాలి.

Exit mobile version