అక్కినేని అఖిల్.. ముద్దుగా అభిమానులు అయ్యగారు అని పిలుచుకునే అక్కినేని మూడవ తరం హీరో. చాలా కాలంగా హీట్ కోసం పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నిస్తూనే ఉన్నాడు. సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నా కూడా సరైన బ్రేక్ రాలేదు. 9 ఏళ్ల సినీ కెరియర్ లో అఖిల్ హిట్ సినిమా ఏది అంటే తడుముకోవాస్సిన పరిస్థితి. అలా అని అఖిల్ పర్ఫామర్ కాదా అంటే అలా ఎమి కాదు. యాక్టింగ్, డాన్స్, సింగింగ్ ఇలా అన్నిటిలో ప్రావిణ్యం ఉంది. సరైన సినిమా పడలేదంతే.
కెరీర్ స్టార్టింగ్ నుండి టాప్ డైరక్టర్ల దర్శకత్వంలో సినిమాలు చేసాడు అఖిల్ బాబు. కానీ అవేమి అఖిల్ కు హిట్ ఇవ్వలేకపోయాయి. బొమ్మరిల్లు భాస్కర్ తో చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కాస్త ఉపశమనం ఇచ్చింది. ఏజేంట్ సంగతి సరే సరి. ఇటీవల సినిమాలకు లాంగ్ గ్యాప్ ఇచ్చాడు అఖిల్. ఈ గ్యాప్ లో పలు కథలు వింటూ కొన్నిటిని లాక్ చేసి ఉంచాడు. అందులో వినరో భాగ్యం విష్ణు కదా ఫేమ్ మురలీ కిషోర్ అబ్బూరితో ఓ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు అఖిల్. ఈ నెల 8న ఈ సినిమాను అధికారకంగా ప్రకటించనున్నారు. కాగా ఈ సినిమాకు ‘లెనిన్’ అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడని ఈ సినిమా కథ తెలిసిన కొందరి మాట.