నటసింహం నందమూరి బాలకృష్ణ చాలా కాలం తర్వాత ఫ్యాక్షన్ రోల్ లో నటిస్తున్న సినిమా ‘వీర సింహా రెడ్డి’. గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రమోషన్స్ ని మేకర్స్ మంచి జోష్ లో చేస్తున్నారు. ‘అఖండ’ తర్వాత బాలయ్య, తమన్ కాంబినేషన్ లో వస్తున్న ఈ మూవీ నుంచి ఇప్పటికే బయటకి వచ్చిన రెండు సాంగ్స్ సూపర్ హిట్స్ అయ్యాయి. ముఖ్యంగా ‘జై బాలయ్య’ సాంగ్ నందమురి అభిమానులని సాటిస్ఫై చేసింది. తాజాగా వీర సింహా రెడ్డి సినిమా నుంచి మూడో పాట కూడా రిలీజ్ కానుంది. డిసెంబర్ 25న క్రిస్మస్ రోజున వీర సింహా రెడ్డి సినిమాలోని మూడో పాట బయటకి రాబోతుంది అంటూ నందమూరి మోక్షజ్ఞ ట్వీట్ చేశాడు.
మాస్ నంబర్ లోడింగ్ అంటూ మోక్షజ్ఞ ట్వీట్ చేయగా, ఈ సాంగ్ ని తమన్ కుమ్మేసాడు అంటూ గోపీచంద్ మలినేని కామెంట్ చేశాడు. ప్రొడక్షన్ హౌజ్ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్ లో కూడా థర్డ్ సింగల్ లోడింగ్ అంటూ పోస్ట్ చేశారు. శేఖర్ మాస్టర్ డాన్స్ కంపోజ్ చేసిన ఈ మాస్ ఐటెం సాంగ్, వీర సింహా రెడ్డి సినిమా ప్రమోషన్స్ కి మంచి కిక్ ఇచ్చే ఛాన్స్ ఉంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో మేకర్స్, వీర సింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫ్యాక్షన్ నేపధ్యం ఉన్న సినిమా కాబట్టి బాలయ్య అడ్డా లాంటి అనంతపూర్ లాంటి ప్రాంతంలో ప్రీరిలీజ్ ఈవెంట్ చేస్తే నందమూరి ఫాన్స్ కి మంచి కిక్ ఇచ్చినట్లు ఉంటుంది. మరి మైత్రి మూవీ మేకర్స్ ఆ సైడ్ ఆలోచిస్తారేమో చూడాలి. జనవరి 12న వీర సింహా రెడ్డి సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది.
VeeraSimhaReddy 3rd Single on 25th👍
Mass Item Number Loading… 💥🔥😎#VeeraSimhaReddy #Balayya #NBK #NandamuriBalakrishna #NBK108 pic.twitter.com/j3pG96uzio— Nandamuri Mokshagna Teja (@Mokshagna_Offl) December 19, 2022