TheyCallHimOG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. సినిమాలు తీసినా తీయకపోయినా.. సినిమా హిట్ అయినా ప్లాప్ అయినా ఆయనకున్న క్రేజ్ మాత్రం తగ్గింది లేదు. ప్రస్తుతం పవన్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. అయితే అందులో అందరూ ఎదురుచుస్తున్న సినిమా OG. సుజీత్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో పవన్ ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే సగం సినిమా షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా పవన్ పొలిటికల్ ప్రచారం కోసం వాయిదా వేసుకుంది. ఏపీ ఎలక్షన్స్ కారణంగా.. సినిమాలకు గ్యాప్ ఇచ్చి పవన్.. పూర్తిగా ప్రచారాలకు అంకితమయ్యాడు. అందుతున్న సమాచారం ప్రకారం వచ్చే ఏడాది ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక పవన్ ఫ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్లకు ఎప్పుడు మూడ్ వస్తే అప్పుడు సోషల్ మీడియాలో పవన్ ను ట్రెండ్ చేస్తూ ఉంటారు.
మరో కొన్ని నెలల వరకు పవన్ సినిమా అప్డేట్స్ రావని తెలిసినా కూడా TheyCallHimOG ని ట్రెండ్ చేయడం మాత్రం మానడంలేదు. సలార్ రిలీజ్ అయిన దగ్గరనుంచి ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఎందుకు ఈ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారో ఎవరికి తెలియదు. కొందరేమో.. సలార్ రికార్డులను బ్రేక్ చేసేది OG అని చెప్పుకొస్తున్నారు. అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుందో కూడా తెలియని సినిమాను ఈ రేంజ్ లో ట్రెండ్ చేయడం కేవలం పవన్ ఫ్యాన్స్ వలనే అవుతుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. మరి పవన్ ఈ సినిమాలను ఎప్పుడు ఫినిష్ చేసేది .. ఈ సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయ్యేది అనేది ఆ దేవుడికే తెలియాలి.