Women Health Tips: నెలసరి నొప్పుల్ని మాయం చేసే ‘సూపర్ ఫుడ్స్’.. ఇంట్లోనే ఇలా ట్రై చేయండి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Women Health Tips: సూర్యుడు ఉదయించక ముందే నిద్ర లేచి ఇంట్లో పనులు చక్కదిద్దుకొని, ఒంటి చేతితో ఇంటి పనులను, పిల్లలను మ్యానేజ్ చేస్తూ.. తమ వృత్తి జీవితాలను కూడా బ్యాలెన్స్ చేసుకుంటున్న మహిళలు ఎందరో ఉన్నారు. నిజానికి మీ కుటుంబంలో ఉన్న మహిళల ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించారా.. వాస్తవానికి మహిళలకు నెలసరి సమయంలో పొత్తికడుపు నొప్పి, నడుము నొప్పి, విపరీతమైన నీరసం, మూడ్ స్వింగ్స్ వంటివి తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటాయి. అయితే ఆ టైంలో వారికి మందుల కంటే, సరైన ఆహారం తీసుకోవడం ద్వారా ఈ సమస్యల నుంచి సింపుల్‌గా ఉపశమనం పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఈ స్టోరీలో ఆ మ్యాజిక్ ఫుడ్స్ ఏంటో తెలుసుకుందాం.
READ ALSO: Tummala Nageswara Rao : కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి తీరని అన్యాయం
Also Read
- Plastic Bucket Cleaning Tips: ప్లాస్టిక్ బకెట్లపై జిడ్డు మరకలా? కొత్తదానిలా మెరిపించే సింపుల్ టిప్స్..
- Eye Health: తరచూ హెడేక్ వస్తోందా? ఎప్పుడు అలర్ట్ కావాలి? వైద్యుల సలహా ఇదే!
- How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
- High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
నెలసరి సమయంలో నీరసంగా అనిపించినా లేదా మూడ్ స్వింగ్స్ ఇబ్బంది పెడుతున్నా నానబెట్టిన ఎండు ద్రాక్ష అద్భుతంగా పనిచేస్తుందని పలువురు నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఇందులో ఉండే ఐరన్, ఫైబర్, ఖనిజాలు రక్తహీనతను తగ్గిస్తాయని వెల్లడించారు. అలాగే మలబద్ధకం సమస్యను కూడా దూరం చేసి, శరీరానికి తక్షణ శక్తిని ఇస్తాయని పేర్కొన్నారు. దీంతో పాటు నెలసరిలో వచ్చే అసౌకర్యాన్ని తగ్గించడంలో చేమదుంప, చిలగడదుంప వంటివి కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు. ఈ దుంప జాతి కూరగాయలు శరీరానికి అవసరమైన పోషకాలను అందించి, కండరాల తిమ్మిర్ల నుంచి ఉపశమనం కలిగిస్తాయని వివరించారు. వీటిని డైట్‌లో చేర్చుకోవడం వల్ల ఆ సమయంలో వచ్చే శారీరక నొప్పులు తగ్గుతాయని తెలిపారు. పీరియడ్స్ పెయిన్‌కు అరటి పండు ఒక ఔషధం లాంటిదని వివరించారు. ఎందుకంటే ఇందులోని పొటాషియం, విటమిన్ బి6 వంటివి ఉండి.. కడుపుబ్బరాన్ని తగ్గిస్తాయని పేర్కొన్నారు. అలాగే సాయంత్రం వేళ అరటి పండు తీసుకోవడం వల్ల రాత్రి పూట హాయిగా నిద్ర పడుతుందని వివరించారు. వంటల్లో అరటి పువ్వును వాడటం వల్ల హార్మోన్లు సమతుల్యంగా ఉంటాయని తెలిపారు. నెలసరి కష్టాలను సులువుగా అధిగమించడానికి ఆరోగ్యకరమైన ఆహారంతో పాటు తగినంత నీరు తాగడం, కాసేపు విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం అని పేర్కొన్నారు.
READ ALSO: Mrunal Thakur: ఆ కారణం వల్లే నా లవర్‌కు నాకు బ్రేకప్ అయ్యింది: మృణాల్ ఠాకూర్
తాజావార్తలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
-
Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
-
OTR: కాంగ్రెస్-బీఆర్ఎస్ కలుస్తాయా? SIRపై కలిసి పోరాడతారా?
-
Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
-
Mumbai: ముంబై బస్ డిపోలో భారీ అగ్నిప్రమాదం.. కాలి బూడిదైన బస్సులు
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!