Devara Teaser: ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందున్న రికార్డ్స్ ఇవే… బ్రేక్ చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో పాన్ ఇండియా బాక్సాఫీస్ రికార్డులని బ్రేక్ చేయడానికి వస్తున్న సినిమా దేవర. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా పార్ట్ 1 ఏప్రిల్ 5న రిలీజ్ కానుంది. అనౌన్స్మెంట్ నుంచే హ్యూజ్ హైప్ ని మైంటైన్ చేస్తున్న దేవర సినిమాపై అంచనాలని మరింత పెంచుతూ మేకర్స్ స్పెషల్ గిఫ్ట్ ని రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. దేవర వరల్డ్ ని పరిచయం చేస్తూ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేయనున్నాడు కొరటాల శివ. సముద్రం బ్యాక్ డ్రాప్ లో ఒక కొత్త వరల్డ్ ని క్రియేట్ చేసి, ఎన్టీఆర్ ని సముద్ర వీరుడిగా, భయానికి కూడా భయం పుట్టించే వీరుడిగా చూపించనున్నాడు కొరటాల శివ. ఇప్పటివరకూ ఇండియన్ స్క్రీన్ పై చూడని ట్రెమండస్ విజువల్స్ ని దేవర సినిమాలో చూడబోతున్నామని కళ్యాణ్ రామ్ కూడా చెప్పడంతో గ్లింప్సె పై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి.
ఆల్ హెయిల్ ది టైగర్ అంటూ అనిరుథ్ ఇచ్చిన ట్యాగ్ తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ జోష్ లోకి వచ్చారు. అయితే దేవర రేంజ్ ఏంటో చూపించాలి అంటే గ్లింప్స్ ముందెన్నడూ చూడని డిజిటల్ రికార్డ్స్ ని క్రియేట్ చేయాలి. ఇప్పటివరకు ఉన్న డిజిటల్ రికార్డ్స్ ని బ్రేక్ చేసి కొత్త హిస్టరీ క్రియేట్ చేస్తే దేవర హైప్ ఆకాశాన్ని తాకుతుంది. ఇది జరగాలి అంటే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ముందున్న టార్గెట్స్ ఏంటో చూద్దాం… పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ గ్లిమ్ప్స్ 940K వ్యూస్, OG గ్లిమ్ప్స్ 730K సింగల్ లాంగ్వేజ్ లో 24 గంటల్లో అత్యధిక లైక్స్ సాధించిన సినిమాల గ్లిమ్ప్స్ లిస్టులో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. సింగిల్ ఛానెల్ మల్టిపుల్ ఆడియో విషయంలో సలార్ 1.67 మిలియన్ లైక్స్ తో టాప్ ప్లేస్ లో ఉంది. సో ఎన్టీఆర్ ఫ్యాన్స్ దేవర గ్లిమ్ప్స్ తో ఆల్ టైమ్ రికార్డ్ సెట్ చేయాలి అంటే భీమ్లా నాయక్ రికార్డ్ ని బ్రేక్ చేసి సింగల్ లాంగ్వేజ్ లో 1 మిలియన్ లైక్స్ ని రీచ్ అవ్వాలి. సింగల్ ఛానెల్ మల్టీ ఆడియోలో 1.7 మిలియన్ లైక్స్ ని రాబట్టి సలార్ గ్లిమ్ప్స్ ని దాటాలి, అప్పుడే దేవర టాప్ ప్లేస్ లో ఉంటుంది. మరి ఈ రికార్డ్ ని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందుకుంటారో లేదో చూడాలి.
Also Read
తాజావార్తలు
-
Rahman : ‘పెద్ది’ ఆ కోరిక తీర్చింది!
-
Ram Charan: నా కెరీర్లోనే ‘పెద్ది’ నంబర్ వన్ చిత్రం
-
AP Film Corporation: ఏపీ ఫిల్మ్ కార్పొరేషన్ నూతన బోర్డు ఏర్పాటు
-
OTR : పాలమూరు కాంగ్రెస్‌లో రచ్చ రచ్చ.. సిటీ ప్రెసిడెంట్ పదవి కోసం కుమ్ములాట!
-
Wife Murder: బీమా డబ్బుల కోసం.. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను కొట్టి చంపేసిన కీచక భర్త..!
ట్రెండింగ్
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?
-
Natural Home Remedy: తెల్ల జుట్టుకు సింపుల్ “హోమ్ రెమిడీ”.. ఆ మూడు పదార్థాలతో ఉంటే చాలు.. నేచురల్‌గా హెయిర్ కలర్ రెడీ.!
-
150కి పైగా స్పోర్ట్స్ మోడ్స్, 9.7mm మందం, 21 రోజుల బ్యాటరీ లైఫ్‌తో Xiaomi Band 10 Pro లాంచ్..!
-
IP69 ప్రో-లెవెల్ వాటర్ రెసిస్టన్స్, 8000mAh భారీ బ్యాటరీ, 144Hz డిస్ప్లేతో Realme 16T 5G లాంచ్.. ధర ఎంతంటే?