వణికిస్తున్న ‘రావణ’ పదం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎక్కడైనా మంచికి ఉన్న విలువ, చెడుకు ఎప్పటికీ లభించదు. మన పురాణాల్లోనూ ఉత్తములకు ఉన్న విలువ, అధములకు ఏ మాత్రం దక్కదు. అయితే ఉత్తములకు కీడు కలిగించిన వారి పేర్లు కూడా వారితో పాటు మననం చేసుకోవలసి వస్తుంది. ఈ ముచ్చట దేనికోసమంటే, మన పురాణాల్లోనే కాదు, తరువాత కూడా రామ అన్న పదానికి ఉన్న విలువ, రామునికి కీడు చేసి, ఆ కారణంగా చనిపోయిన రావణుడి పేరుకు లేదని చెప్పడానికే! ఇప్పటికీ రావణ అన్న పేరు వినగానే ఓ దుష్టుడు అనే భావన మన వాళ్ళలో ఉంది. అలాంటి రావణ పదం మన సినిమా టైటిల్స్ లో చోటు సంపాదిస్తే ఏముంది? సదరు చిత్రాలూ అంతే సంగతులు అని చెప్పుకోవలసిందే! ఇటీవల రవితేజ హీరోగా రావణాసుర అనే చిత్రం ప్రారంభమయింది. గత సంవత్సరం ‘క్రాక్‘తో సూపర్ హిట్ అందుకున్న రవితేజ, ఈ సారి కూడా ఓ ఐదు చిత్రాలతో సందడి చేసే ప్రయత్నం లో ఉన్నారు. అంత స్పీడు చూపిస్తున్న రవితేజ సినిమా టైటిల్ లో రావణ అన్న మాట చోటు చేసుకోవడం ఆయనను అభిమానించే వారికి ఆందోళన కలిగిస్తోంది.
ఎందువల్ల? గతంలో ఏయన్నార్ హీరోగా దాసరి నారాయణరావు ‘రావణుడే రాముడయితే?‘ అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా విడుదలకు ముందు ఎంతో బజ్ నెలకొంది. అయితే చిత్రం విడుదలైన తరువాత పోటీ చిత్రాలముందు తుస్సుమంది. ఆ తరువాత రావు గోపాలరావు ప్రధాన పాత్రలో బాపు ‘కలియుగ రావణాసురుడు‘అనే చిత్రం తెరకెక్కించారు. షరా మామూలే అన్నట్టు అది ఢామ్ అంది. పోనీ, అందులో రావు గోపాలరావు ప్రధాన పాత్రధారి కాబట్టి, సినిమా అంతగా ఆడలేదు అనుకుందాం. కృష్ణంరాజు, కె.రాఘవేంద్రరావు అంటేనే సూపర్ కాంబినేషన్ వారి కాంబోలో వచ్చిన ‘అమరదీపం', 'త్రిశూలం', 'బొబ్బిలి బ్రహ్మన్న‘ చిత్రాలు మంచి విజయం సాధించాయి. అయితే కృష్ణంరాజుతో రాఘవేంద్రరావు తెరకెక్కించిన ‘రావణబ్రహ్మ‘ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. ఈ మధ్య వచ్చిన ‘రావణలంక‘ అనే చిత్రం పరిస్థితి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మన తెలుగునాటనే కాదు, మణిరత్నం తెరకెక్కించిన ‘రావణన్‘ ఏమయిందో అందరికీ తెలిసిందే! ఇలా రావణ అన్న మాట టైటిల్ లో ఉంటే ఏదో కీడు శంకిస్తున్నారు జనం. మరి ఈ సెంటిమెంట్ ను తెలిసి ‘రావణాసుర‘ టీమ్ తమ టైటిల్ మార్చుకుంటుందా? లేక ఏమయితే ఏమయింది అని ముందుకు పోతుందా? ఒకవేళ ఈ బ్యాడ్ సెంటిమెంట్ ను ఈ ‘రావణాసుర‘ ఏమైనా బ్రేక్ చేస్తుందా? ఏమవుతుందో చూడాలి.
Also Read
- The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
- Devara 2 Update : 'వర'కు ఏమైంది ?... జాన్వీ ప్రశ్నపై తారక్ సీరియస్
- Peddi Controversy : 'పెద్ది' ముద్దుపై బుచ్చిబాబు ఫస్ట్ రియాక్షన్... ఏమన్నారంటే?
- NTR Viral Tweet: కుకీలు పంపమన్న అభిమాని.. ఎన్టీఆర్ క్రేజీ రిప్లై ట్వీట్ వైరల్!
తాజావార్తలు
-
Monsoon 2026: ఆ రాష్ట్రాలకు భారీ ముప్పు.. శని, ఆదివారాల్లో అత్యంత భారీ వర్షాలు.. ఐఎమ్‌డీ హై అలర్ట్!
-
Chittoor: లిక్కర్ వ్యాన్ బోల్తా.. బాటిళ్ల కోసం ఎగబడ్డ జనం.!
-
Bi-Monthly Salary: నెలలో రెండుసార్లు జీతాలు? ఇండియాలో శాలరీలు ఇచ్చే విధానం మారనుందా?
-
Parvathipuram Manyam: పామాయిల్, జీడి తోటల్లో ఏనుగుల బీభత్సం.. భయంతో వణికిపోతున్న రైతులు.!
-
The Odyssey Ticket Price : రికార్డులు బద్దలు కొడుతున్న విజువల్ వండర్.. టికెట్ రేటు ఒక్కోటి ఒకటిన్నర లక్ష.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!