పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, మారుతీ దర్శకత్వంలో ‘ది రాజా సాబ్’ అనే సినిమా రూపొందింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిధి కుమార్ హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాని హారర్ ఫాంటసీ థ్రిల్లర్గా రూపొందించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించారు.
Also Read: The Raja Saab: నేటి నుంచి ‘ది ఓల్డ్ రాజా సాబ్’ సీన్స్.. నిర్మాత కీలక ప్రకటన!
అయితే ఈ సినిమాకి మొదటి నుంచి అంచనాలు ఒక రేంజ్ లో ఉన్నాయి. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా వాయిదాలు పడుతూ ఎట్టకేలకు జనవరి 9వ తేదీ రిలీజ్ డేట్ ప్రకటించారు. ఒకరోజు ముందుగానే సినిమాకి ప్రీమియర్స్ పడ్డాయి. అయితే ప్రీమియర్స్ కి ఓవర్సీస్ లో నెగిటివ్ టాక్ వచ్చింది, ఇండియాలో మిక్స్డ్ టాక్ వచ్చింది. మొత్తం మీద మొదటి రోజు 112 కోట్లు కలెక్ట్ చేసినట్లు నిర్మాతలు ప్రకటించారు.
Also Read: Drunk and Driving: జర్రుంటే సచ్చిపోతుండేగా.. కారుతో తాగుబోతు బీభత్సం..!
కానీ సినిమా విషయంలో ప్రభాస్ ఫాన్స్ అయితే ఏమాత్రం హ్యాపీగా లేరు. కలెక్షన్స్ సంగతి పక్కన పెడితే కంటెంట్ విషయంలో వారు సాటిస్ఫై అవ్వలేదని చెప్పాలి. అయితే ఈ సమయంలోనే ప్రభాస్ కి ‘ఆర్’ (R) సెంటిమెంట్ కలిసి రాదనే విషయం మరోసారి తెరమీదకు వచ్చింది. నిజానికి ప్రభాస్ కెరీర్ మొదట్లోనే చేసిన ‘రాఘవేంద్ర’ సినిమా అప్పట్లో అసలు ఏమాత్రం వర్కవుట్ కాలేదు. ఆ తర్వాత లారెన్స్ దర్శకత్వంలో చేసిన ‘రెబల్’, రాధాకృష్ణ దర్శకత్వంలో చేసిన ‘రాధే శ్యామ్’.. అసలు ప్రభాస్ కెరీర్ లో చేయకుండా ఉంటే బాగుండు అనిపించేలాంటి రిజల్ట్స్ అందుకున్నాయి.
అయితే రాజా సాబ్ విషయంలో మాత్రం ఆ సినిమాకి టైటిల్ లో ముందు ‘ది’ తగిలించారు. తగిలించాలన్న మాటే కానీ, ఎప్పుడూ పెద్దగా ఆ ‘ది’ పదాన్ని వాడలేదు; అందరూ ‘రాజా సాబ్’ అనే ప్రస్తావిస్తూ వచ్చారు. చివరికి ఈ సినిమా రిజల్ట్ ఆశించిన మేర రాకపోవడంతో, ప్రభాస్ కెరీర్ లో ఈ ‘ఆర్’ (R) పేరుతో వచ్చే టైటిల్స్ కలిసి రావడం లేదని చర్చ సాగుతోంది.