Mystery Crime Thriller OTT : కంటైనర్‌లో ఒంటరి మహిళ.. ఓటీటీలోకి మైండ్ బెండ్ చేసే మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mystery Crime Thriller OTT : క్రైమ్ కథలతో ఎన్నో సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయి. అయితే కొన్ని థ్రిల్లర్ సినిమాలు మైండ్ బ్లాక్ చేస్తూ చివరి వరకు సస్పెన్స్‌లో ముంచేస్తుంటాయి. అలాంటి థ్రిల్లర్ సినిమా ఇప్పుడు ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కి వచ్చేస్తోంది. ఈ కొత్త క్రైమ్ థ్రిల్లర్ లో ఓ మహిళ ఒక కంటైనర్‌లో అపస్మారక స్థితిలో దొరకడం, ఆమెకు తన గతం గురించి ఏమీ గుర్తు లేకపోవడం, ఆ తర్వాత వచ్చే ట్విస్ట్‌లు ఊహకు కూడా అందకుండా ఉంటాయి. ఇప్పుడు ఈ ఉత్కంఠభరితమైన కథతో ఓటీటీ ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పేరు ‘ది మార్క్డ్ ఉమెన్’ (The Marked Women). ఈ స్పానిష్ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ను చూసేందుకు ప్రేక్షకులు కూడా ఆసక్తితో ఉన్నారు.
నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్
‘ది మార్క్డ్ ఉమెన్’ స్పానిష్ మిస్టరీ క్రైమ్ థ్రిల్లర్ మూవీ 2026 జూన్ 5 నుండి ప్రపంచవ్యాప్తంగా నేరుగా నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో కాండెలా పెన్యా, అనా రుజాస్, పోల్ లోపెజ్ ప్రధాన పాత్రల్లో నటించారు. దీని ట్రైలర్ చూస్తేనే చూడాలనే ఇంటెన్స్ పెరగుతుంది. అనూహ్య మలుపులు ఉండేలా దర్శకుడు గేబ్ ఇబానెజ్ ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది. ఇక ఇందులో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘Money Heist’లో నటించిన లుకా పెరోస్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే మనోలో సోలో, కిరా మిరో వంటి ప్రముఖ నటులు కూడా ఇందులో నటించారు. జూన్ 5 నుంచి Netflixలో ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ ఇంగ్లీష్, స్పానిష్ భాషలతో పాటు తెలుగు, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానుండటంతో భారతీయ ప్రేక్షకులు కూడా ఈ మైండ్ బెండింగ్ క్రైమ్ థ్రిల్లర్‌ను ఆస్వాదించే అవకాశం పొందనున్నారు.
Also Read
- Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
- Maruthi: మళ్ళీ హోం గ్రౌండ్‌కి డైరెక్టర్ మారుతి?
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
‘ది మార్క్డ్ ఉమెన్’ కథ
కథ మొత్తం బార్సిలోనా నగరంలోని ఒక పోర్ట్‌లో ప్రారంభమవుతుంది. అక్కడ ఉన్న ఓ కంటైనర్‌లో చేతులు, కాళ్లు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కిన స్థితిలో ఒక మహిళను పోలీసులు గుర్తిస్తారు. ఆమెను రక్షించిన తర్వాత కూడా అసలు తానెవరో, అక్కడికి ఎలా వచ్చిందో గుర్తు చేసుకోలేకపోవడం కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది. దర్యాప్తులో ఆమెకు అమ్నీషియా ఉన్నట్లు తేలుతుంది. దీంతో ఈ కేసును ఛేదించే బాధ్యత డిటెక్టివ్ అన్నా రిపోల్కు అప్పగిస్తారు. ఆఫీసర్ క్విక్ జారేట్ సహాయంతో ఆమె విచారణ ప్రారంభిస్తుంది. మొదట సాధారణ కేసులా కనిపించిన ఈ ఘటన వెనుక అనేక రహస్యాల క్రమంగా బయటపడతాయి. ఆమెను చంపేందుకు ఒక కిల్లర్ కూడా ప్రయత్నిస్తుంటాడు. అసలు ఆ మహిళ అసలు ఎవరు ? ఆమె గతంలో ఏం జరిగింది ?ఎందుకు ఆమెను బంధించారు ? ఆమెను చంపేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తి ఎవరు అనే ప్రశ్నలు కథను ఉత్కంఠభరితంగా ముందుకు నడిపిస్తాయి.
తాజావార్తలు
-
Flydubai Hijacking Caseలో బిగ్ ట్విస్ట్.. ఇద్దరు పైలట్ల అరెస్టుతో పెరిగిన ఉత్కంఠ
-
Robot: షాకింగ్.. 16 ఏళ్ల బాలికపై రోబో లైంగిక వేధింపులు..
-
YS Jagan: మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్ల ఎంపికపై జగన్ కసరత్తు.. 6 గంటల పాటు కీలక సమావేశం..
-
Ladakh: లడఖ్ భారత్‌లో అంతర్భాగం.. చైనాకు భారత్ స్ట్రాంగ్ కౌంటర్..
-
Prabhas: మళ్ళీ ప్రభాస్‌తో మూవీ.. కన్మర్మ్ చేసిన టీజీ విశ్వప్రసాద్
ట్రెండింగ్
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!