అక్కినేని యంగ్ హీరో ప్రస్తుతం వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. వరుసగా లవ్ స్టోరీ, బంగార్రాజు చిత్రాల హిట్స్ తో దూసుకుపోతున్నాడు. ఇప్పుడు నాగ చైతన్య తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. ఈ మేరకు విదేశాల్లో తన కొత్త సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా ఉన్నాడు. ‘థాంక్యూ’ చివరి షెడ్యూల్ రష్యా, మాస్కోలోని కొన్ని అందమైన ప్రదేశాలలో జరుగుతోంది. రెండు వారాల్లో సినిమా పెండింగ్‌లో ఉన్న అన్ని పార్ట్‌లు పూర్తవుతాయి. దానితో మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. నాగ చైతన్య, రాశి ఖన్నా, ప్రకాష్ రాజ్ తదితరులు ప్రస్తుతం రష్యాలో ‘థ్యాంక్యూ’ షూటింగ్ చేస్తున్నారు.
Read Also : ఆర్ఆర్ఆర్, రాధేశ్యామ్ బాటలో మరో పాన్ ఇండియా మూవీ..
కొన్ని రోజుల కిందట ఇటలీ షెడ్యూల్ కు రెండవ వేవ్ కరోనా వైరస్ కారణంగా అంతరాయం కలిగింది. మహమ్మారి ఆంక్షల కారణంగా ప్రకాష్ రాజ్ సెట్స్‌లో చేరలేకపోయాడు. అన్ని అనుమతులు పొందిన తర్వాత బృందం ఇప్పుడు రష్యాకు వెళ్లింది. అక్కడే ఇటలీలో పూర్తి చేయాల్సిన కొన్ని సన్నివేశాలను పూర్తి చేయబోతున్నారు. వేసవిలో సినిమాను విడుదల చేసేందుకు ‘థాంక్యూ’ టీమ్ ఆసక్తిగా ఉంది. ఈ ప్రాజెక్ట్ కు విక్రమ్ కుమార్ దర్శకుడు కాగా, దిల్ రాజు నిర్మాత. ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కి థమన్ సంగీతం, నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ‘థ్యాంక్యూ’ సినిమాలో నాగ చైతన్య పలు షేడ్స్‌లో కనిపించనున్నాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు మేకర్స్.