బాలీవుడ్ లాస్ట్ ఇయర్ థౌజండ్ క్రోర్ మార్క్ మిస్సయ్యింది. దీనికి మెయిన్ రీజన్ త్రీ ఖాన్స్ సందడి లేకపోవడమే. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చడ్డా తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుంటే.. సల్మాన్ ఖాన్ టైగర్‌తో రెస్ట్ ఇచ్చాడు. డంకి ప్లాప్ తో షారుక్ గ్యాప్ ఇచ్చాడు. అలా ఈ ముగ్గురు స్టార్ 2024ని స్కిప్ చేశారు. ఈ ఏడాది ఆ ఛాన్స్ ఇవ్వదలుచుకోలేదు. ముందుగా తనకు అచ్చొచ్చిన రంజాన్ పండుగకు సికందర్ అంటూ వచ్చేశాడు సల్మాన్ ఖాన్. రొటిన్ కొట్టుడు కొడితే.. ఆడియన్స్ ఇంటికి పంపారు. రష్మిక ఇమేజ్ కూడా సల్లూ భాయ్‌ను కాపాడలేకపోయింది.
Also Read : Mega Star : ఆయనకు రాకపోతే అసలు నేషనల్ అవార్డు అనేదానికి అర్థమే లేదు
లాల్ సింగ్ చడ్డా డిజాస్టర్ తర్వాత సిల్వర్ స్క్రీన్‌కు దూరంగా ఉన్న మిస్టర్ ఫర్ ఫెక్ట్ రీసెంట్లీ తారే జమీన్ పర్ సీక్వెల్ సితారా జమీన్ పర్‌తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్స్ సోసో గానే ఉన్నాయి. ఫైనల్ రన్ లో ఎంత వరకు రాబడుతుందో చూడాలి. ఇక ఇప్పడు కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ వంతు. డంకీ తర్వాత భారీ గ్యాప్ ఇచ్చిన బాద్ షా నెక్ట్స్ ‘కింగ్’ అనే మూవీని చేస్తున్నాడు. ఈ సినిమాతో తన కూతురు సుహానా ఖాన్‌ను వెండితెరకు పరిచయం చేస్తున్నాడు షారూఖ్. తన లక్కీ గర్ల్ దీపికా ఇందులో కీ రోల్ ప్లే చేస్తోంది. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ ముంబయి మోహబూబ్ స్టూడియోలో జరుగుతోంది. భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న ఇందులో రూత్ లెస్ అండ్ మాస్ కింగ్ ఖాన్ ని చూడబోతున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది రిలీజ్ చేస్తామని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాతో హీట్ కొట్టి మరోసారి తన సత్తా ఏమిటో చూపించే బాధ్యత షారుక్ పై ఉంది.