శరవేగంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న హారర్ డ్రామా ది డెవిల్స్ చైర్. మనిషిలోని కొరికేలే అశాంతికి మూలం అని చెప్పిన గౌతమ్ బుద్ధిని వాక్యం తో మొదలయ్యే ఈ సినిమా నిజంగానే మనిషిలోని అతి కోరికల వల్ల ఎలా పతనం అయ్యారో తెరపైన చూపిస్తుంది. హారర్ ని డ్రామాతో కలిపి ఇంతకు ముందు వచ్చిన చాల సినిమాలు విజయం సాధించాయి .ఇదే ఫార్ములాని యువ దర్శకుడు గంగ సప్తశిఖర ఫాల్లౌ అవుతూ అప్డేటెడ్ టెక్నాలజీ ఐన ఏ ఐ ని వాడుకొని ఒక మంచి సినిమాని ది డెవిల్స్ చైర్ రూపం లో రిలీజ్ చెయ్యడానికి సిద్ధం అయ్యాడు . ఇటీవలే రిలీజ్ ఐన ఈ సినిమా ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది .ఈ సినిమా ఈ నెల 22 కి అమెరికా లో రిలీజ్ అవుతుంది , 21 న ఇండియాలో రిలీజ్ అవుతుంది . ది డెవిల్స్ చైర్ ఒక పాన్ వరల్డ్ సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది . ది డెవిల్స్ చైర్ సినిమాను చైతన్య , వెంకట్ దుగ్గిరెడ్డి , చంద్ర, ఏ ఎన్ ఆర్ సంయుక్తంగా బాబీ ఫిలిమ్స్ , ఓం సాయి ఆర్ట్స్ , సి ఆర్ ఎస్ క్రియేషన్స్ బ్యానర్స్ పై నిర్మించారు.