South Vs North : సౌత్ వర్సెస్ నార్త్ అన్నట్లుగా మారిపోయిన బాక్సాఫీస్ లెక్కలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒకప్పుడు వంద కోట్లు కొడితే గోప్ప.. కానీ ఇప్పుడు లెక్కలు మారాయి. హండ్రెడ్ క్రోర్ నుండి.. ధౌజండ్ క్రోర్‌గా టార్గెట్ ఫిక్సైంది. కేవలం ఇండియా మార్కెట్‌లోనే వంద కోట్లు కొల్లగొట్టడం ఎలా అనేది నార్త్‌కు లెసన్స్ నేర్పింది సౌత్. దీన్ని ఛాలెంజింగ్‌గా తీసుకుని బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అయితే ఇప్పటి వరకు వెయ్యి కోట్ల కలెక్షన్స్‌లో సదరన్ బెల్ట్‌దే అప్పర్ హ్యాండ్. బాహుబలి2, ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్2, కల్కి, పుష్ప2తో థౌజండ్ క్రోర్ చిత్రాల జాబితాలో లాస్ట్ ఇయర్ వరకు మనదే హవా.. కానీ ధురంధర్2 వచ్చి ఆ నంబర్ సమం చేసింది.
Also Read : Demand Heroines In South : మోస్ట్ డిమాండబుల్ సౌత్ హీరోయిన్స్ వీళ్ళే
Also Read
దంగల్ పేరుకు రెండు వేలు కోట్లైనా.. ఇండియాలో మాత్రం 500 కోట్లే. మిగిలినదీ చైనా మార్కెట్ నుండి కొల్లగొట్టింది. కానీ బాహుబలి2 ఇండియా బాక్సాఫీస్‌కు టార్చ్ బేరరైంది. ఆ వెంటనే ట్రిపుల్ ఆర్, కేజీఎఫ్2 చిత్రాలు బాలీవుడ్‌కు నిద్ర లేకుండా చేశాయి. కసిగా తీసుకున్న బాలీవుడ్.. పఠాన్, జవాన్ రూపంలో రెండు థౌజండ్ క్రోర్ ఫిల్మ్స్ దించేసింది. కానీ ఆ ఆనందాన్ని ఆవిరి చేశాయి కల్కి, పుష్ప2 చిత్రాలు. కానీ గత ఏడాది ధురంధర్‌తో రివెంజ్ తీర్చుకుంది. ఇలా సౌత్ మెరిసిన ప్రతిసారి బాలీవుడ్ బదులు తీర్చుకుంటూనే ఉంది. మొన్నటి వరకు థౌజండ్ క్రోర్ చిత్రాల్లో సౌత్ ఇండస్ట్రీదే అప్పర్ హ్యాండ్. ఇప్పటి వరకు వెయ్యి కోట్లు రాబట్టుకున్న సినిమాల జాబితాలో ఐదు సినిమాలు మనవే కాగా.. నాలుగు బాలీవుడ్ ఫిల్మ్స్. కానీ ధురంధర్2తో లెక్కలు సరిచేసింది. గత ఏడాది టాలీవుడ్ మెరవకపోవడం.. కాంతార చాప్టర్2 వెయ్యికోట్లు దగ్గరగా వచ్చి ఆగిపోవడంతో సౌత్‌తో ఈక్వెల్ అయ్యింది నార్త్. ఇప్పుడే అసలు సిసలైన పోటీ మొదలైంది. నెక్ట్స్ వెయ్యికోట్లు కొల్లగొట్టే సినిమా సౌత్ నుండి వస్తుందా నార్త్ నుండి లోడ్ అవుతుందా అన్న ఇంట్రస్ట్ క్రియేట్ అవుతోంది. థౌజండ్ క్రోర్ మూవీ ఏ ఇండస్ట్రీ అందిస్తుందో..? నార్త్ వర్సెస్ సౌత్‌లో ఏదీ లీడ్ పొజిషన్ తీసుకుంటుందో చూడాలి.
తాజావార్తలు
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Prabhas : వాయిదాలకు కేరాఫ్ అడ్రస్ ప్రభాస్ మూవీస్
-
Thomson 4K QLED Smart TVs: థామ్సన్ నుంచి కొత్త 4K QLED స్మార్ట్ టీవీలు.. ధర రూ.11,999 నుంచే!
-
Nepal Flood Alert: నేపాల్‌లో వరద హెచ్చరిక.. బుధి గండకి నదికి భారీ వరద ముప్పు
-
Abhishek Sharma: సూర్యకుమార్ ప్రపంచ రికార్డుపై కాటేరమ్మకొడుకు కన్ను..
ట్రెండింగ్
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!
-
Least Eligible Bachelor: లీస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ రివ్యూ..
-
Onion Peel Benefits: ఉల్లిపాయ తొక్కలను పారేస్తున్నారా? వీటి ఉపయోగాలు తెలిస్తే చెత్తబుట్టలో అస్సలు వేయరు..!
-
Tirumala: నవరాత్రి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ.. నేటి నుంచి ప్రత్యేక దర్శనాలు రద్దు.!
-
WCL 2026: ఉతప్ప మెరుపులు వృథా.. భారత్ ఛాంపియన్స్‌పై సౌతాఫ్రికా విజయం.!