కమల్‌హాసన్ హీరోగాప్రముఖ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన చచిత్రం ‘థగ్ లైఫ్’. కోలీవుడ్ యంగ్ హీరో శింబు, హాట్ బ్యూటీ త్రిష, సీనియర్ నటి అభిరామి కీలక పాత్రల్లో నటించారు. నాయకన్ సినిమా అంటే దాదాపు 36 సంవత్సరాల తర్వాత మణిరత్నం కమల్ కాంబోలో సినిమా కావడంతో రిలీజ్ కు ముందు ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో మణిరత్నం, కమల్ హాసన్ ఎదో మ్యాజిక్ చేస్తారని ఊహించినవారికీ భంగపాటు ఎదురైంది.
భారీ అంచనాల మధ్య థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. మణిరత్నం నాసిరకం వర్క్ అని ఓ రేంజ్ లో ఆడీయన్స్ విమర్శలు గుప్పించారు. ఈ ఏడాది తమిళ లో రిలీజ్ అయిన బిగ్గెస్ట్ డిజాస్టర్ లో ఒకటిగా స్తానం సంపాదించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చింది. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను రిలీజ్ కు ముందు భారీ ధరకు కొనుగోలు చేసింది ప్రముఖ ఓటిటీ సంస్థ నెట్ ఫ్లిక్స్. వాస్తవానికి ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ అయ్యాక ఎనిమిది వారాలకు స్ట్రీమింగ్ చేసేలా డీల్ క్లోజ్ చేసారు. కానీ తీరా సినిమా రిలీజ్ అయ్యాక యునానిమస్ డిజాస్టర్ టాక్ తెచుకోవడంతో నాలుగు వారాలలోనే స్ట్రీమింగ్ కు తీసుకు వచ్చింది నెట్ ఫ్లిక్స్. తమిళ్ తో పాటు, తెలుగు, కన్నడ, మలయాళం, హింది భాషలలో థగ్ లైఫ్ ను స్ట్రీమింగ్ చేస్తుంది. ఓటీటీలో ఎలాంటి రెస్పాన్స్ తెచుకుంతుందో చూడాలి.